స్టాక్ మార్కెట్ సెన్సేషనల్ రికార్డు: మొదటిసారి 60 వేలు దాటిన సెన్సెక్స్, అల్ టైం హైకి నిఫ్టీ ..

First Published Sep 24, 2021, 11:37 AM IST

నేడు ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున శుక్రవారం స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ప్రారంభమైంది. సెన్సెక్స్ తొలిసారిగా 60 వేలు దాటింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 325.71 పాయింట్లు (0.54 శాతం) లాభంతో 60211.07 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 93.30 పాయింట్ల (0.52 శాతం) లాభంతో 17916.30 వద్ద ప్రారంభమైంది.

గత వారం సెన్సెక్స్ 710 పాయింట్లు (1.21 శాతం) లాభపడింది. ప్రారంభ ట్రేడ్‌లో 1293 షేర్లు లాభపడ్డాయి, 355 షేర్లు క్షీణించాయి అలాగే 89 షేర్లు మారలేదు. సెన్సెక్స్‌లో జాబితా చేయబడిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 262 లక్షల కోట్లు దాటింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెన్సెక్స్‌ 50వేల మార్క్‌ను క్రాస్‌ చేయగా కేవలం ఆరునెలల్లో మరో 10 వేల పాయింట్లను టచ్‌ చేసి అంతర్జాతీయ మార్కెట్‌లతో పోటీ పడుతున్నాయి.
 

ఈ కారణాల వల్ల

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వెలువడ్డాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కానీ రాబోయే రోజుల్లో కోత కూడా సూచించింది. ఐ‌పి‌ఓ మార్కెట్ కూడా జోరుగా కొనసాగుతుంది. ఒక విధంగా ఇది పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని పెంచింది. రెండో త్రైమాసికంలో కంపెనీలు మంచి ఫలితాలను ఆశిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి  సెకండ్ వేవ్ ని ఎదురుకొంటూ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా తిరిగి ట్రాక్‌లోకి వస్తోంది. పరిశ్రమలకు ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జి‌డి‌పి వృద్ధి రేటు 20.1 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్ కారణంగా ఇన్వెస్టర్లలో కరోనా భయం ముగిసినట్లు కనిపిస్తోంది. ఈ అంశాలన్నీ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.
 

ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, ఎల్ అండ్ టి, టెక్ మహీంద్రా, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ , సన్ ఫార్మా, మారుతి, డాక్టర్ రెడ్డీస్, ఐ‌టి‌సి, రిలయన్స్, బజాజ్ ఆటో, హెచ్‌డి‌ఎఫ్‌సి, ఎస్‌బి‌ఐ, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమయ్యాయి. మరోవైపు, టాటా స్టీల్, ఎన్‌టిపిసి, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ షేర్లు రెడ్ మార్క్‌లో ప్రారంభమయ్యాయి.
 

ప్రీ-ఓపెన్ సమయంలో

ఉదయం 9.01 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో సెన్సెక్స్ 60,131.70 స్థాయిలో 246.34 పాయింట్లు (0.41 శాతం) పెరిగింది. నిఫ్టీ 93.70 పాయింట్లు (0.53 శాతం) పెరిగి 17,916.70 వద్ద ఉంది.

సెన్సెక్స్-నిఫ్టీ గురువారం గ్రీన్ మార్క్‌లో 
గురువారం కూడా స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 351.37 పాయింట్లు (0.60 శాతం) లాభంతో 59,278.70 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 115.10 పాయింట్ల లాభంతో (0.66 శాతం) 17,661.80 వద్ద ప్రారంభమైంది. తర్వాత మార్కెట్ ర్యాలీని కొనసాగించింది.  గత సెషన్‌లో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ముగిసింది
 

గత చివరి సెషన్‌లో స్టాక్ మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల తర్వాత రికార్డు స్థాయిలో ముగిసింది. సెన్సెక్స్ 958.03 పాయింట్ల (1.63 శాతం) లాభంతో 59,885.36 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 276.30 పాయింట్ల (1.57 శాతం) లాభంతో 17,822.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 17,822.95, నిఫ్టీ 17,843.90 ని తాకింది.
 

click me!