స్టాక్ మార్కెట్ అల్ టైమ్ రికార్డు.. సెన్సెక్స్ మొదటిసారి 59 వేల స్థాయికి..

First Published Sep 16, 2021, 3:23 PM IST

నిన్న రికార్డు స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్  నేడు ఉదయం అత్యధిక స్థాయిలో ప్రారంభమైంది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డ్‌లను సృష్టిస్తున్నాయి. సెన్సెక్స్‌ సూచీలు 58,900మార్క్‌ను టచ్‌ చేయగా నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిలో 17550 మార్క్‌ టచ్‌ చేసి ట్రేడింగ్‌ ను కొనసాగిస్తుంది. 

దీంతో  గురువారం స్టాక్క్‌ మార్కెట్లు లాభాల్లో దూసుకెస్తుంది. ఉదయం 9.50 గంటల సమయంలో నిఫ్టీ 44 పాయింట్లు లాభంతో 17560 వద్ద, సెన్సెక్స్‌ 143 పాయింట్లు పెరిగి 58,866 వద్ద ట్రేడింగ్ అయ్యాయి.
 

ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ మొదటిసారి 59 వేల స్థాయిని తాకింది. సెన్సెక్స్ 59042.77, నిఫ్టీ 17,597.85 కి చేరుకున్నాయి. టెలికం రంగంలో ఆటోమేటిక్‌ విధానం ద్వారా 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడంతో వొడాఫోన్‌ ఐడియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ టవర్స్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, అపోలో ట్రైకోటా ట్యూబ్స్‌, జేటీఈకేటీ ఇండియా షేర్లు లాభాల్లో ఉండగా  హట్సన్‌ అగ్రో ప్రొడక్ట్స్‌,హింద్‌ కాపర్‌, జెన్సార్‌ టెక్నాలజీస్‌, రెస్పాన్సీవ్‌ ఇండస్ట్రీస్‌, పాలీ మెడీక్యూర్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.   
 

ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతరం మద్దతు అందిస్తుంది. టెలికాం రంగానికి నిన్న కేంద్ర క్యాబినెట్ కీలక ప్రకటన చేసింది.  కరోనా వైరస్ మహమ్మారి  సెకండ్ వేవ్ ని ఎదురుకొంటు దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా తిరిగి ట్రాక్‌లోకి వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జి‌డి‌పి వృద్ధి రేటు 20.1 శాతంగా ఉంది. మొదటి త్రైమాసికంలో చైనా 7.9 శాతం వృద్ధి రేటు నమోదు చేసినందున ఇది చైనా కంటే మెరుగైన గణాంకాలు. అంటే చైనా కంటే భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా మెరుగుపడిందని భావించవచ్చు. ఒక విధంగా ఈ గణాంకాలు పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని పెంచింది. అలాగే  విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) నిరంతరం పెరుగుతున్నాయి. దీనితో పాటు, వ్యాక్సినేషన్ కారణంగా ఇన్వెస్టర్లలో కరోనా భయం పోయినట్లు తెలుస్తుంది. ఈ అంశాలన్నీ కూడా షేర్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.
 

హెవీ వెయిట్ షేర్లు

 ప్రారంభ ట్రేడ్ లో భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సి‌ఎల్ టెక్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, ఎస్‌బిఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్ , బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఐ‌టి‌సి, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎల్&టి, యాక్సిస్ బ్యాంక్, మారుతి, టి‌సి‌ఎస్, ఎన్‌టి‌పి‌సి, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డి‌ఎఫ్‌సి షేర్లు లాభాలలో ప్రారంభమయ్యాయి. మరోవైపు నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు నష్టాలలో  ప్రారంభమయ్యాయి.
 

సెన్సెక్స్-నిఫ్టీ

నిన్న బుధవారం ఉదయం  స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 49.76 పాయింట్ల (0.09 శాతం) లాభంతో 58296.85 వద్ద ప్రారంభం కాగా  నిఫ్టీ 13.80 పాయింట్ల (0.08 శాతం) లాభంతో 17393.80 స్థాయిలో ప్రారంభమైంది.
 

 గత చివరి సెషన్‌లో స్టాక్ మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల తర్వాత రికార్డు స్థాయిలో ముగిసింది. సెన్సెక్స్ 476.11 పాయింట్ల (0.82 శాతం) లాభంతో 58,723.20 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 139.45 పాయింట్ల (0.80 శాతం) లాభంతో 17,519.45 వద్ద ముగిసింది. 

click me!