భారతీయ టెలికాం రంగాన్ని బలోపేతం చేసే భారత ప్రభుత్వ సంస్కరణలను జియో స్వాగతిస్తున్నది..

Ashok Kumar   | Asianet News
Published : Sep 15, 2021, 08:57 PM IST

భారత ప్రభుత్వం బుధవారం ప్రకటించిన సంస్కరణలు, ఉపశమన ప్యాకేజీని దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్  జియో హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నది. ఎందుకంటే  భారత టెలికాం రంగాన్ని బలోపేతం చేయడానికి సకాలంలో అడుగు వేయడం సహాయపడుతుందని చెప్పారు.  

PREV
15
భారతీయ టెలికాం రంగాన్ని బలోపేతం చేసే భారత ప్రభుత్వ సంస్కరణలను జియో స్వాగతిస్తున్నది..

ఒక అధికారిక ప్రకటనలో ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా విజన్ సాక్షాత్కారాన్ని వేగవంతం చేస్తాయని, ప్రపంచంలోని ప్రముఖ డిజిటల్ సొసైటీగా భారతదేశాన్ని మార్చడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది.

25

 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం టెలికాం రంగంలో తొమ్మిది నిర్మాణాత్మక సంస్కరణలు, ఐదు ప్రక్రియ సంస్కరణలకు ఆమోదం తెలిపింది.
 

35

"డిజిటల్ రివొల్యూషన్ 1.35 బిలియన్ భారతీయులకు అందించడమే జియో లక్ష్యం. ఈ మిషన్ ద్వారా మార్గనిర్దేశం చేసే ప్రపంచంలో ఎక్కడైనా, అత్యంత సరసమైన ధరలలో భారతీయులకు అత్యధిక నాణ్యత ,అత్యధిక డేటా యాక్సెస్ ఉండేలా చూసుకున్నాము. ప్రభుత్వం టెలికాం రంగ సంస్కరణలు మా కస్టమర్లకు కొత్త, ఎక్కువ ప్రయోజనాలను అందించడానికి ప్రోత్సహిస్తాయి, "అని కంపెనీ తెలిపింది.
 

45

 "డిజిటల్ ఇండియా విజన్ అన్ని లక్ష్యాలను, మైలురాళ్లను చేరుకోవడంలో భారత ప్రభుత్వం, ఇతర పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము, తద్వారా మేము సమిష్టిగా ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని ఉత్పాదకంగా తయారు చేయవచ్చు, ప్రతి భారతీయుడి ఈజీ ఆఫ్ లివింగ్ మెరుగుపరుస్తాము, "ఆర్‌ఐ‌ఎల్  తెలిపింది.

55

Mukesh Ambani

ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, "టెలికాం రంగం ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనది, భారతదేశాన్ని డిజిటల్ సొసైటీగా మార్చడానికి కీలకమైనది, భారత ప్రభుత్వం సంస్కరణలు, సహాయక చర్యల ప్రకటనను నేను స్వాగతిస్తున్నాను. ఇది డిజిటల్ ఇండియా లక్ష్యాలను సాధించడానికి పరిశ్రమను అనుమతిస్తుంది. నేను ఈ సాహసోపేత ఇనీషియేటివ్ కి ప్రధాన మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ” అని అన్నారు.

click me!

Recommended Stories