వరుస 4వ రోజు కూడా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. క్షీణించిన సెన్సెక్స్, నిఫ్టీ..

First Published Oct 1, 2021, 6:20 PM IST

 బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య స్టాక్ మార్కెట్ అక్టోబర్ మొదటి ట్రేడింగ్ రోజున అస్థిరతల తర్వాత చివరికి నష్టాలలో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 360.78 పాయింట్లు (0.61 శాతం) తగ్గి 58,765.58 వద్ద ముగిసింది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 86.10 పాయింట్లు (0.49 శాతం) తగ్గి 17,532.05 వద్ద ముగిసింది. 

 ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచిలపై అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల సూచీల స్థిరీకరణ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. మరోవైపు గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే సహజవాయువు, సీఎన్‌జీ, ఎల్‌పీజీ ధరలు సైతం పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను వెంటాడాయి. దీంతో స్టాక్ మార్కెట్ వరుస నాలుగో రోజు కూడా నష్టపోయింది. సుమారు 1716 షేర్లు అడ్వాన్స్ అయితే, 1373 షేర్లు క్షీణించాయి, 150 షేర్లు మారలేదు. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 74.10గా ఉంది.

stock market

  ఎం& ఎం, కోల్ ఇండియా, ఐ‌ఓ‌సి, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఒఎన్‌జిసీ షేర్లు లాభాలలో ముగిసింది. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, మారుతి, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు రెడ్ మార్క్‌లో ముగిశాయి.  

  నేడు మీడియా, మెటల్, ఫార్మా, పిఎస్‌యూ బ్యాంకులు, ఇంధన రంగాల షేర్లు కొనుగోలు చేస్తే.. . మరోవైపు రియల్టీ, ఐ‌టి, ఎఫ్‌ఎం‌సి‌జి, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఆటో  రంగాలలో అమ్మకాలు కనిపించాయి. 

నేడు  ఉదయం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభ సమయంలో నష్టాలలో  ప్రారంభమైంది. సెన్సెక్స్ 394.26 పాయింట్లు (0.67 శాతం) తగ్గి 58732.10 వద్ద ప్రారంభం కాగా,  నిఫ్టీ 110 పాయింట్ల (0.62 శాతం) పతనంతో 17508.20 స్థాయిలో ప్రారంభమైంది.
 

స్టాక్ మార్కెట్  నిన్న హెచ్చు తగ్గులు తర్వాత చివరికి రెడ్ మార్క్‌తో ముగిసింది. సెన్సెక్స్ 286.91 పాయింట్లు (0.48 శాతం) తగ్గి 59,126.36 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 93.15 పాయింట్లు (0.53 శాతం) తగ్గి 17,618.15 వద్ద ముగిసింది.

click me!