UPI: ఇప్పుడు మీరు గూగుల్ పే, ఫోన్ పేల నుంచి ఏకంగా పది లక్షలు ఒకేసారి పంపించేయొచ్చట

Published : Sep 10, 2025, 05:46 PM IST

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి UPI ద్వారా చెల్లింపులు చేసే వారికి ఒక శుభవార్త. ఇకపై సెప్టెంబర్ 15, 2025 నుండి UPI లావాదేవీల పరిమితి  పెరగబోతోంది. మీరు ఒక్కసారే పది లక్షల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

PREV
15
మీకొక శుభవార్త

UPI ద్వారా చెల్లింపులు చేసే వారు ఇప్పుడు పెరిగిపోయారు. వారందరికీ NPCI శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 15, 2025 నుండి కొత్త నియమాలు అమలులోకి తెస్తున్నట్టు వివరించింది. ఇన్సూరెన్స్, లోన్ EMI, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్, ప్రభుత్వ రుసుములు, ట్రావెల్ బుకింగ్‌లకు వంటివాటికి చెల్లించేందుకు రూ.10 లక్షల వరకు ఒకేసారి చెల్లించే అవకాశాన్ని కల్పించింది. PhonePe, Google Pay, Paytm యాప్‌ల ద్వారా ఈ సదుపాయం అందుతుంది.

25
UPI లావాదేవీల పరిమితి

P2P లావాదేవీల పరిమితి ప్రస్తుతం రోజుకు కేవలం ఒక లక్ష రూపాయలగానే ఉంది. ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌లకు రూ.5 లక్షల వరకు పెరిగింది. క్రెడిట్ కార్డ్ బిల్లులకు ఒకేసారి రూ.5 లక్షలు, రోజుకు రూ.6 లక్షలు వరకు చెల్లించే అవకాశాలను కల్పిస్తోంది. ట్రావెల్ బుకింగ్‌లకు ఒకేసారి రూ.5 లక్షలు చెల్లించవచ్చు.

35
ఈఎమ్ఐలు చెల్లించేందుకు వీలు

లోన్ చెల్లింపులు, EMI చెల్లింపులకు ఒకేసారి రూ.5 లక్షలు లేదా రోజుకు రూ.10 లక్షలు చెల్లించవచ్చు. నగల కొనుగోలుకు రూ.2 లక్షల వరకు, రోజుకు రూ.6 లక్షల వరకు చెల్లించవచ్చు.

45
UPI కొత్త నియమాలు
FDలకు రూ.5 లక్షల వరకు డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. BBPS ద్వారా విదేశీ చెల్లింపులకు రూ.5 లక్షల వరకు అనుమతి ఉంది. IPOలకు రూ.5 లక్షల పరిమితి అలాగే ఉంది. UPI ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్, ఇన్సూరెన్స్, ప్రభుత్వ రుసుములు, ట్రావెల్ బుకింగ్‌లు చెల్లించవచ్చు.
55
ఇన్సూరెన్స్ ప్రీమియం
కొత్త పరిమితితో పెద్ద మొత్తాలను ఒకేసారి చెల్లించవచ్చు. లోన్ EMI, ఇన్సూరెన్స్ ప్రీమియం, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్, ప్రభుత్వ రుసుములు, నగల కొనుగోలుకు ఇది ఉపయోగపడుతుంది. అదనపు ఛార్జీలు ఉండవు. డిజిటల్ లావాదేవీలు సులభతరం అవుతాయి.
Read more Photos on
click me!

Recommended Stories