HDFC Bank: వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్‌డిఎఫ్‌సి, కస్టమర్లకు ఇంటి ఈఎమ్ఐ ఎంత తగ్గుతుందో తెలుసుకోండి

Published : Sep 10, 2025, 10:35 AM IST

పండుగ సీజన్ వచ్చేసింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయినా హెచ్‌డిఎఫ్‌సి తన కస్టమర్ల కోసం ఒక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఎంత రేట్లు తగ్గుతాయో తెలుసుకోండి. 

PREV
14
హెచ్‌డిఎఫ్‌సి బంపర్ ఆఫర్

భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు కూడా కస్టమర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు కార్లపై లక్షల రూపాయల డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగం కూడా తన కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. పండుగ సీజన్లోనే అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్ డిఎఫ్‌సి తన కస్టమర్ల కోసం ఒక నిర్ణయం తీసుకుంది. తాము ఎంపిక చేసిన కాలపరిమితిలో ‘మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ (MCLR)’ రేట్లుని ఐదు బేసిస్ పాయింట్లకు తగ్గించింది. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి.

హెచ్ ‌డిఎఫ్‌సి బ్యాంకు MCLR ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించడం వల్ల లక్షలాదిమంది కస్టమర్లకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా వారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. రుణాలు తీసుకోవడం కూడా సులభంగా మారుతుంది.

24
MCLR అంటే ఏమిటి?

ఇది ఒక బ్యాంకు రుణం ఇవ్వగల కనీస వడ్డీ రేటు. దీనిని ఆర్బిఐ 2016లోనే ప్రారంభించింది. ఒక బ్యాంకు MCLRను తగ్గించినప్పుడల్లా ఆ బ్యాంకు దగ్గర రుణం తీసుకున్న వారు ఈఎమ్ఐ పై ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా గృహ ఋణం తీసుకున్న వారిపై ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. హెచ్డిఎఫ్‌సి బ్యాంకు గృహ రుణం రిపోర్ట్ కు అనుసంధానించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రేట్లు 7.90 శాతం నుండి 13.20 శాతం వరకు ఉన్నాయి. ఇది ఆ కస్టమర్ ప్రొఫైల్ అంటే జీతము బట్టి ఆధారపడి ఉంటుంది.

34
నెల వారీ ఈఎమ్ఐ తగ్గుతుంది

ఎంసీఎల్ఆర్ తగ్గించడం వల్ల ఈఎంఐ కొద్దిగా తగ్గుతుంది. ఉదాహరణకు మీరు 20 సంవత్సరాల కాలానికి 50 లక్షల గృహ రుణం కలిగి ఉన్నారనుకోండి. ఎంసీఎల్ఆర్ తగ్గించడం వల్ల కొంత కాలపరిమితి వరకు ఈఎమ్ఐ నెలకు ఎంతో కొంత తగ్గుతుంది.

44
కొత్త వడ్డీ రేట్లు ఇదిగో

హెచ్డిఎఫ్‌సి బ్యాంకు అధికారిక వెబ్సైట్ చెబుతున్న ప్రకారం కొత్త రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి. ఒక నెల నుంచి మూడు నెలల వరకు ఎలాంటి మార్పు చేయలేదు. కానీ ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు ఎంసీఎల్ఆర్ 8.65 శాతానికి తగ్గించారు. ముందు 8.70శాతానికి ఉండేది. ఐదు బేసిస్ పాయింట్ల తగ్గించడం వల్ల నెలవారి ఈఎంఐ చెల్లింపుల్లో మీకు 6 నెలల నుంచి సంవత్సరం మధ్యకాలంలో 250 రూపాయలు నుంచి 350 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే రెండు సంవత్సరాల పాటు ఎంసీఎల్ఆర్ 8.70 శాతం ఉంటుంది. ఇక్కడ కూడా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించారు. ముందుగా 8.75% ఉండేది. దీనివల్ల రెండేళ్ల పాటు మీకు నెలకి ఎంతో కొంత ఈఎంఐ ఆదా అవుతూనే ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories