స్విగ్గి, జొమోటో నుండి ఫుడ్ ఆర్డర్లు చేసుకునే వారి సంఖ్య అధికంగానే ఉంది. ఆ యాప్‌లలో తక్కువ ధరకే వస్తుందని ఎంతోమంది అనుకుంటారు. అలాగే ఇంటికి తెచ్చిస్తున్నారని ఆనందపడతారు. నిజానికి మిమ్మల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు.
స్విగ్గి, జొమోటో నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని తక్కువకే వచ్చింది లే... అని సంతోష పడిపోయేవారు ఎంతోమంది. నిజానికి మీరు రెస్టారెంటుకెళ్ళి నేరుగా తినే కన్నా రెట్టింపు ధరకు స్విగ్గి, జొమోటో నుండి ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు.. స్వయంగా ఒక వ్యక్తి తన అనుభవాన్ని వివరించాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
25
రేట్ల మధ్య తేడా
కోయంబత్తూరుకు చెందిన సుందర్ అనే ఒక యూజర్ తన ఆన్లైన్ ఆర్డర్ స్క్రీన్ షాట్ ను, అలాగే నేరుగా రెస్టారెంట్ కి వెళ్లి తినడం వల్ల ఎంత బిల్లు వచ్చిందో... అది కంపేర్ చేస్తూ పోస్టు పెట్టాడు. దాదాపు రెట్టింపు ధరలకు స్విగ్గి, జొమోటోలో అమ్ముతున్నట్టు బయటపడింది. అతను స్విగ్గీ ద్వారా పరాటాలు, చికెన్ 65, చికెన్ లాలీపాప్స్, చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాడు. దీని మొత్తం బిల్లు 1473 రూపాయలు. అతను అదే ఆహారాన్ని నేరుగా రెస్టారెంట్ కి వెళ్లి కొనుగోలు చేశాడు. కేవలం 810 రూపాయలు మాత్రమే చెల్లించాడు. అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల మనం రెట్టింపు ధరలను చెల్లించాల్సి వస్తోంది.
35
ధరలు ఇవిగో
స్విగ్గీలో ఒక పరాటా ధర 35 రూపాయలే ఉంటే.. అదే రెస్టారెంట్లో కేవలం రూ.20కే లభిస్తోంది. అలాగే చికెన్ 65 ధర స్విగ్గీలో 240 రూపాయలు ఉంటే.. నేరుగా రెస్టారెంట్లో 150 రూపాయలకే దొరుకుతోంది. ఇంతగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లలో ధరలను అధిక మొత్తానికి అమ్ముతున్నారు. పైగా డిస్కౌంట్ ఇస్తున్నట్టు చెప్పి మోసం చేస్తున్నారు. దీనివల్ల వారికి రెట్టింపు ఆదాయం వస్తోంది. అందుకే స్విగ్గి, జొమోటోలా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.
సుందర్ పెట్టిన ఈ పోస్టు ఆన్లైన్లో వైరల్ గా మారింది. ఇంత అధిక ధరలకు తాము స్విగ్గీ, జొమోటోలలో ఆర్డర్ చేస్తున్నామా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది మాత్రం ఇంటికి తెచ్చిస్తున్నారు. కాబట్టి సౌలభ్యం కోసం అధిక ధర చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇంటికి తెచ్చి ఇచ్చినందుకు ఒక 100 రూపాయలు అధికంగా తీసుకున్న పర్వాలేదు.. కానీ ఏకంగా రెట్టింపు ధరలకు అమ్మడం అన్యాయమని వాదిస్తున్నారు కొంతమంది.
55
కమిషన్ ఇవ్వాలి అందుకే...
స్విగ్గి,జొమాటోలతో అనుసంధానమైన రెస్టారెంట్లు ఆ యాప్ లకు కొంత కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ కమిషన్ 24% నుంచి 28% వరకు ఉంటుంది. ఆ కమిషన్ డబ్బులను తిరిగి పొందాలంటే రెస్టారెంట్లు ఆన్లైన్లో పెట్టిన మెనూలో ధరలను పెంచేస్తున్నాయి. ఆ భారం కస్టమర్ల పైనే పడుతుంది. అందుకే మధ్యలో డెలివరీ యాప్‌లు కోట్లు గడిస్తున్నాయి.
గతంలో స్విగ్గీ ఇదే విషయంపై స్పందించింది. రెస్టారెంట్లు ఆన్లైన్ స్విగ్గీ, జొమోటోలో పెట్టే ధరలపై తమకి ఎటువంటి నియంత్రణ లేదని స్పష్టంగా చెప్పింది. ఆన్లైన్లో, ఆఫ్ లైన్లో ధరలు ఎంత పెట్టుకోవాలన్నది రెస్టారెంట్ ఇష్టమేనని ఆ కంపెనీ వివరించింది.