మేరా రేషన్ యాప్‌ను లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ.. ఇక దేశంలోని ఏ మూల నుండి అయినా రేషన్ పొందవచ్చు..

Ashok Kumar   | Asianet News
Published : Mar 16, 2021, 01:20 PM IST

వలస కూలీలకు సహాయం చేయడానికి ప్రభుత్వం మేరా రేషన్ యాప్‌ను ప్రారంభించింది. భారత ప్రభుత్వ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ (ఒఎన్‌ఆర్‌సి) లో భాగంగా మేరా రేషన్ యాప్‌ను ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. జీవనం కోసం వలస వెళ్ళే  కార్మికులు, రేషన్ కార్డులు ఉన్న కార్మికులకు మై  రేషన్ యాప్ ఎంతో ఉపయోగపడనుంది. 32 రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం మేరా  రేషన్ యాప్ నుండి లబ్ధి పొందుతున్నాయి.

PREV
15
మేరా రేషన్ యాప్‌ను లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ.. ఇక దేశంలోని ఏ మూల నుండి అయినా రేషన్ పొందవచ్చు..

మేరా రేషన్ యాప్ ప్రారంభించినట్లు ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ 2019 ఆగస్టులో కేవలం 4 రాష్ట్రాలతో ప్రారంభించామని, 2020 డిసెంబర్ నాటికి ఇది 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరుకుందని చెప్పారు. 

25

ఢీల్లీ, ఛత్తీస్‌ఘడ్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌ను మేరా రేషన్ యాప్‌లో  మరి కొన్ని నెలల్లో చేర్చనున్నారు. ఈ రేషన్ కార్డ్ పోర్టబుల్ విధానం ద్వారా సుమారు 69 కోట్ల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతారని సుధాన్షు పాండే తెలిపారు. అలాగే ప్రతి నెలా సుమారు 15 మిలియన్ల లావాదేవీలు జరుగుతాయి.

35

మేర రేషన్ యాప్ ఎలా పని చేస్తుంది?
 మేర రేషన్ యాప్ ప్రస్తుతం అండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు మేరా రేషన్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని తరువాత, మీరు రేషన్ కార్డు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. దీని తరువాత ఈ యాప్ సహాయంతో మీరు దేశంలోని ఏ రేషన్ స్టోర్ నుండి అయిన రేషన్ తీసుకోగలుగుతారు. 

45

ఈ యాప్ లో మీరు ఎప్పుడు, ఎక్కడ, ఏ రేషన్ స్టోర్ నుండి రేషన్ తీసుకున్నారో కూడా మీకు తెలుస్తుంది. ఈ యాప్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే దీని ద్వారా మీకు సమీప రేషన్ స్టోర్ గురించి కూడా సమాచారం లభిస్తుంది. ఈ యాప్ ఆధార్ స్టాండర్డ్ కలిగి ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషలకు సపోర్ట్  చేస్తుంది. అయితే త్వరలో 14 స్థానిక భాషలకు సపోర్ట్  చేయనుంది.

55
click me!

Recommended Stories