Nikhil Kamath: జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ WTF ఆన్‌లైన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ పర్‌ప్లెక్సిటీ AIలో ఇంటర్నింగ్‌పై తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. తన ప్రస్తుత రోజువారి పనులకు మించి మరింత నేర్చుకోవాలనే కోరికను వ్యక్తంచేస్తూ కృత్రిమ మేధస్సు రంగంలో మరింత నేర్చుకోవడానికి మూడు నెలల పాటు జీతం లేకుండా పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
నిఖిల్ కామత్ స్వయంగా హోస్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌లో పర్‌ప్లెక్సిటీ AI సహ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ ఉన్నారు. తాను మూడు నెలల పాటు ఉచితంగానే పర్‌ప్లెక్సిటీలో ఇంటర్న్ చేయడం విషయం పై స్పందించాడు. తన ప్రస్తుత ప్రయత్నాలలో తగినంతగా నేర్చుకోవడం లేదని తాను భావిస్తున్నాననీ, AIలో మరింత లోతుగా వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పాడు.
కామత్ ఆసక్తిని అభినందిస్తూ, శ్రీనివాస్ ఈ ఆలోచనను స్వాగతించారు, ఆయనను ఇందులో చేర్చుకోవడం గౌరవంగా ఉంటుందని అన్నారు. కామత్ తన సిగ్నేచర్ హాస్యంతో, రాబోయే 30 రోజుల్లో పర్‌ప్లెక్సిటీలో శ్రీనివాస్‌ను ప్రతిరోజూ "పీస్టర్" చేయడానికి హాజరు కావచ్చని అన్నారు.
ఈ క్రమంలోనే శ్రీనివాస్ బెంగళూరులో తన ఇంటర్న్‌షిప్ విషయాలు కూడా గుర్తుచేసుకున్నాడు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జిల్లాల్లో ఒకటైన కోరమంగళలో మూడు వారాలు పనిచేశాడు. నగరంలో ఎంతో హడావిడి ఉంటున్నప్పటికీ తన దృష్టి పూర్తిగా పనిపైనే ఉన్నందున అతను పెద్దగా అన్వేషించలేదని ఒప్పుకున్నాడు. ఆ సమయాన్ని గుర్తుచేసుకుంటూ, బెంగళూరును మరింత పూర్తిగా అనుభవించే అవకాశాన్ని తాను కోల్పోయానని చెప్పాడు. ట్రాఫిక్ అప్పట్లో కూడా ఇప్పటిలాగే ఉండేదని అన్నాడు. ఇంట్లోనే ఉండి పని చేయడం తెలివైన ఎంపిక కావచ్చు అని కూడా చమత్కరించాడు.
అలాగే, చెన్నైలోని వేడి, తేమతో కూడిన పరిస్థితులతో పోలిస్తే బెంగళూరులోని వాతావరణం తనపై సానుకూల ప్రభావం చూపిందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. చెన్నై కంటే ఇక్కడి వాతావరణం ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుందని అన్నాడు.
ఏఐ రంగంలో పెరుగుతున్న అవకాశాలు, పోటీని ప్రస్తావించారు. AI పోటీ దారుల మధ్య వేగవంతమైన ప్రగతి, పోటీ ఉన్నప్పటికీ ChatGPT, ఆంత్రోపిక్, జెమిని, గ్రోక్, మెటా AI, పర్‌ప్లెక్సిటీ AIతో సహా చాలా ప్రముఖ చాట్‌బాట్‌ల ప్రధాన సామర్థ్యాలు చాలా సారూప్యంగా ఉన్నాయన్నారు. సెర్చ్ భాగం మినహా చాలా AI మోడల్‌లు సాధారణ మూల్యాంకన కొలమానాలు, బెంచ్‌మార్క్‌లపై దృష్టి పెట్టడం వల్ల ఇలాంటి సమాధానాలను అందిస్తున్నాయని శ్రీనివాస్ వివరించారు. ప్రస్తుతం ప్రధాన పోటీదారుల మధ్య ఎక్కువ గుణాత్మక వ్యత్యాసం లేదన్నారు.