Financial Tasks: మార్చి 31 లోపు ఈ 3 పనులు చేయకపోతే చాలా నష్టపోతారు
Financial Tasks: ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిపోతోంది. ఈ లోపు ఈ 3 పనులు చేయకపోతే మీరు చాలా డబ్బును నష్టపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Financial Tasks: ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిపోతోంది. ఈ లోపు ఈ 3 పనులు చేయకపోతే మీరు చాలా డబ్బును నష్టపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు వ్యాపారులు, ఉద్యోగులు తమ ఆదాయ మార్గాల గురించి ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. వీటిని బట్టి ట్యాక్స్ లు ఎంత కట్టాలన్న విషయం నిర్ధారణ అవుతుంది. మీరు వ్యాపారాలు నిర్వహిస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా ఈ సమాచారం మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. మార్చి 31 లోపు కచ్చితంగా చేయాల్సిన 3 పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
TDS తగ్గించుకోవాలంటే..
మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నారా? అయితే మీరు మీ కంపెనీ యాజమాన్యం మీకు ఫారం 12బీబీ ఇచ్చి వివరాలు పూర్తి చేసి ఇమ్మని చెప్పి ఉంటుంది. ఈ ఫారం తిరిగి సబ్మిట్ చేయడానికి మార్చి 31 లాస్ట్ డేట్. ఒకవేళ కంపెనీ యాజమాన్యం(ఎంప్లాయర్)ఈ విషయం మర్చిపోయినా మీరే శ్రద్ధగా 12బీబీని సబ్మిట్ చేయాలి. లేకపోతే మీరు ఎక్కువ టీడీఎస్(TDS) కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీరు 12 బీబీ ఫారం తీసుకోకపోతే వెంటనే తీసుకొని వివరాలతో తిరిగి సబ్మిట్ చేయండి.
ఈ ఫారం 12 బీబీ ఏంటి?
ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయి తన ఎంప్లాయర్(యాజమాన్యం)కు విధేయతగా ఉండాలి. అంటే కంపెనీ ఇచ్చిన జీతం ఏ విధంగా ఉపయోగకరమైన పనులకు ఖర్చుపెడుతున్నాడో చెబితే కంపెనీ TDS(Tax deduction at source) తక్కువ కట్ చేస్తుంది. లేదంటే ఎక్కువ కట్ చేస్తుంది.
12బీబీ ఫారంలో మీరు తీసుకున్న హోమ్, వెహికల్ లోన్స్, ఇన్స్యూరెన్స్ వివరాలు తదితర ఉపయోగకరమైన ఖర్చుల వివరాలు తెలియజేస్తూ 12బీబీ ఫారం ఇస్తే టీడీఎస్ తక్కువ పడుతుంది.
ట్యాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే..
మీరు ట్యాక్స్ ను ఆదా చేయాలనుకుంటున్నారా? సెక్షన్ 80సీ ద్వారా ఎక్కువ ట్యాక్స్ ను సేవ్ చేసుకోవచ్చు. అంటే సెక్షన్ 80సీ వర్తించే కొన్ని ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్ లో మీరు పెట్టుబడి పెడితే ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సిన అవసరం ఉండదు. మీరు సెక్షన్ 80సీ ని ఉపయోగించుకుంటే రూ.1.50 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఉదాహరణకు లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం తీసుకోవడం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం, ఈపీఎఫ్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, సేవింగ్స్ లో ఇన్వెస్ట్ చేయడం, ఇన్య్సూరెన్స్ స్కీమ్స్ లో జాయిన్ అవ్వడం ఇలాంటి వాటిపై పెట్టుబడి పెట్టి ఆ వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తే ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ని పొందవచ్చు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి మార్చి 31 లాస్ట్ డేట్. ఈ పథకం పేరు ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్(MSSC)’. ఇందులో మహిళలు ఎవరైనా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. దీనికి 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలంటే మీ సమీపంలోని పోస్టాఫీసు, లేదా బ్యాంకుకు MSSC అకౌంట్ ఓపెన్ చేయండి. ఇందులో మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడి పెట్టడానికి గరిష్ట పరిమితి రూ.2 లక్షలు. ఈ డబ్బు మీకు రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో కలిపి వస్తుంది. ఈ స్కీమ్ లో చేరడానికి చివరి తేదీ కూడా మార్చి 31.