కత్తి లాంటి కారు కొనాలనుకుంటున్నారా, అయితే కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారు ఫీచర్స్ తెలుసుకోండి..

First Published Dec 28, 2022, 1:35 AM IST

కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో భారత్‌లోకి ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. దీని అధికారిక ప్రారంభ తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఇది 2023 మధ్య నాటికి వస్తుందని భావిస్తున్నారు. కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొన్ని కీలక ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్  లోపలి భాగంలో చాలా మార్పులు చేశారు. కొత్త క్రెటా గతంలో వచ్చిన టక్సన్‌ను పోలి ఉండే బ్రాండ్ అని నిపుణులు చెబుతున్నారు. కొత్త పారామెట్రిక్ గ్రిల్‌ని కలిగి ఉన్న భారీ రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లో చూడవచ్చు. గ్రిల్ దాని పూర్తి వెడల్పుకు విస్తరించి ఉంది. మునుపటి కంటే ఎక్కువ దీర్ఘచతురస్రాకారంలో కనిపించే హెడ్‌ల్యాంప్‌లు బంపర్ దిగువ భాగంలో కొద్దిగా ఉంచారు. వెనుక భాగంలో రెండు నిలువు మడతలు కలిగి ఉన్న పదునైన టెయిల్‌ల్యాంప్‌లతో సవరించారు. 
 

డ్యాష్‌బోర్డ్ డిజైన్ ప్రస్తుత మోడల్‌కు సమానంగా ఉన్నప్పటికీ, కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను, ఇప్పటికే మార్కెట్లో ఉన్న అల్కాజార్ నుండి తీసుకున్నారు. SUV అప్ గ్రేడ్ చేసిన హ్యుందాయ్  బ్లూలింక్ కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీతో వస్తుంది, ఇది వాలెట్ పార్కింగ్ మోడ్, స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్,  స్టోలెన్ వెహికల్ ఇమ్మొబిలైజేషన్ వంటి కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తోంది. 
 

కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 1.4L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో కొనసాగుతుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT, ఒక CVT, iMT యూనిట్ ఉంటాయి. నవీకరించబడిన క్రెటా మోడల్ లైనప్ కూడా CNG ఇంధన ఎంపికతో కూడా వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

కొత్త క్రెటాలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ తాకిడి, బ్లైండ్ స్పాట్ మానిటర్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు ఫార్వర్డ్ కొలిషన్ ఎగవేత వంటి ఫీచర్లు ఉన్న అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అమర్చబడింది. అయితే, ADAS సూట్ టాప్-ఎండ్ ట్రిమ్‌లో మాత్రమే అందించబడుతుంది.
 

కొత్త 2023 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుతం మార్కెట్లోని టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్,  మారుతి గ్రాండ్ విటారాతో సహా కొన్ని కొత్త ప్రత్యర్థులను ఎదుర్కొంటుంది. ఇదిలా ఉండగా, టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా వంటి కార్ల తయారీదారులు కూడా రాబోయే రెండేళ్లలో కొత్త మోడల్‌లతో రోడ్లపైకి రానున్న మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో క్రెటా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

click me!