Business Ideas: వాట్సప్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా, వెంటనే తెలుసుకొని ప్రారంభించండి..

First Published Dec 28, 2022, 12:02 AM IST

వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతాం. ఫోటోలను కూడా షేర్ చేస్తాం. వీడియో కాల్‌లో మాట్లాడుకుందాం. అయితే వాట్సాప్ కేవలం లైక్‌లకే పరిమితం కాదు.  మీరు WhatsApp ద్వారా  డబ్బు కూడా సంపాదించవచ్చు. WhatsApp ద్వారా డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకుందాం. 

WhatsApp ద్వారా డబ్బు సంపాదించడం ఎలా? :

WhatsApp ద్వారా సంపాదించడం చాలా సులభం. కొన్ని చిట్కాలు పాటిస్తే ఆదాయం పొందవచ్చు. అయితే డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ లేదు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ అయినా, కష్టపడకుండా డబ్బు సంపాదించలేము. 

WhatsApp బిజినెస్ చేసే వారి కోసం ప్రత్యేకంగా, వాట్సప్ బిజినెస్ యాప్  రూపొందించింది. మీరు ఈ అప్లికేషన్‌ ద్వారా మీ ఉత్పత్తులను విక్రయించవచ్చు. లేదా  మీ వెబ్‌సైట్ గురించి ఇతర వ్యక్తులకు తెలియజేయవచ్చు. లేదా మీ వెబ్‌సైట్‌ని ఇతరులు విజిట్ చేసేలా చేయవచ్చు. 

మీరు WhatsApp Business యాప్‌లో అన్ని రకాల ఉత్పత్తులను విక్రయించవచ్చు. కానీ అక్రమ వస్తువులను విక్రయించలేరు. ఉదాహరణకు డ్రగ్స్, పొగాకు, ఆల్కహాల్, ఆయుధాలు, జంతువులు,  వైద్య ఉత్పత్తులను విక్రయం లేదు. ఇది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అలాగే మీ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మీరు వాట్సాప్ ద్వారా చట్టబద్ధమైన వ్యాపారం చేయవచ్చు. 

ముందుగా మీరు Google Play Store లేదా Apple Play Store నుండి WhatsApp Business అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆపై వ్యాపార ప్రొఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఆ తర్వాత ఫోన్ నంబర్‌ను నమోదు చేసి ధృవీకరించండి. ఆపై వ్యాపార పేరును నమోదు చేయండి. మీరు వ్యాపార వర్గాన్ని ఎంచుకుని, ఇమెయిల్ చిరునామా, వెబ్‌సైట్ చిరునామా మరియు ఇతర సమాచారాన్ని అందించండి.
 

ఆపై మీ ఖాతాను వేరొకరితో షేర్ చేయండి. కస్టమర్‌లు మీ ఉత్పత్తిని ఇష్టపడితే, వారు దానిని కొనుగోలు చేస్తారు. ఈ విధంగా మీరు తక్కువ మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చు. మీరు WhatsAppలో బిజినెస్ చేస్తుంటే WhatsApp మీ లావాదేవీల బాధ్యత తీసుకోదు. వాట్సాప్ ద్వారా ఏదైనా వస్తువును విక్రయిస్తే వినియోగదారుడి నుంచి డబ్బు వసూలు చేయాల్సిన బాధ్యత మీదే అవుతుంది. వాట్సాప్‌తో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. 

click me!