ప్రస్తుతం సెల్ ఫోన్ మార్కట్ ఎలా ఉందంటే.. రోజుకో కొత్త ఫోన్ రిలీజ్ అవుతోంది. అంతేకాకుండా కొత్త టెక్నాలజీతో అప్ డేటెడ్ గా ఉంటున్నాయి. ఈ ఫీచర్ బాగుంది కదా అని ఓ కంపెనీ ఫోన్ కొంటే మరునాడే దాన్ని మించిన టెక్నాలజీతో వేరే కంపెనీ కొత్త ఫోన్ రిలీజ్ చేస్తోంది. అందువల్ల కొత్త ఫీచర్స్ ను మీరు ఉపయోగించుకొని ఎంజాయ్ చేయాలనుకుంటే కచ్చితంగా ఫోన్లు మార్చాల్సిందే.
ఇప్పటి వరకు మీరు కెమెరా పనితీరు బాగుండాలని వివిధ కంపెనీల ఫోన్లు ఉపయోగించి ఉంటారు. ఎందుకంటే అందరూ సెల్ఫీలకు, చుట్టూ ఉన్న అందాలను క్లిక్ అనిపించడానికి ఇష్టపడతారు. అయితే టాప్ యాంగిల్ నుంచి ఫొటోలు తీయాలంటే కుదరదు కదా.. పక్కనే ఉన్న పెద్ద బిల్డింగ్ లాంటివి ఎక్కి ఫొటోలు, రీల్స్ చేయడం చూస్తుంటాం. ఇకపై అంత కష్టపడాల్సిన పని లేదు. రెడ్‌మి నుంచి ఫ్లయింగ్ కెమెరా ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెడ్‌మి తక్కువ ధరకే మంచి ఫోన్లని ఇస్తోంది. రెడ్‌మి ఫ్లయింగ్ కెమెరా 5G అనేది కొత్త ఫోన్. రూ.20,000 కంటే తక్కువ ధరకే మంచి కెమెరా, బలమైన పెర్ఫార్మెన్స్ కలిగి ఉంది.
రెడ్‌మి ఫ్లయింగ్ కెమెరా 5G అందమైన డిజైన్ కలిగి ఉంది. 180 గ్రాముల బరువుతో IP68 రేటింగ్ కలిగి ఉండటం వల్ల దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది.
6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది.
MediaTek Dimensity 1200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5G కనెక్టివిటీ, మంచి బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది.
స్టోరేజ్, మెమరీ
1. 4 GB RAM + 64 GB స్టోరేజ్
2. 6 GB RAM + 128 GB స్టోరేజ్
3. 8 GB RAM + 256 GB స్టోరేజ్
8 GB వరకు మెమరీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు.
కెమెరా
32MP ఫ్రంట్ కెమెరా, మంచి వీడియో రికార్డింగ్ క్వాలిటీ కలిగి ఉంది.
బ్యాటరీ
4500mAh బ్యాటరీ, 48W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది. 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
కనెక్టివిటీ
5G, Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంది.
దీని ధర మార్కెట్ లో రూ.20 వేల వరకు ఉంది. అయితే మీకు తక్కువ ధరకు కావాలంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో ప్రయత్నించండి. ఆ వెబ్ సైట్లలో మీకు కేవలం రూ.15,000 నుంచి లభిస్తుంది. ఇకపై మీరు ఫొటోలు, రీల్స్ తీసుకోవడానికి డ్రోన్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ ఉపయోగించి అద్భుతమైన చిత్రాలు తీసుకోవచ్చు.