కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు వాటి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంత కాలానికి వారందరి ఎదురు చూపులు ఫలించాయి. దేశంలోని వివిధ విభాగాలు, శాఖలు, సంస్థల్లో ఖాళీలను నింపేందుకు 2025 సంవత్సరం ప్రారంభ నెల అయిన జనవరిలోనే నోటిఫికేషన్లు విడుదల చేశారు. ముఖ్యంగా కోచిన్ షిప్‌యార్డ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రైల్వే, సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, ఎన్ఎల్సీ ఇండియా వంటి సంస్థల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో వివరాలు తెలుసుకుందాం.