పన్ను వసూళ్లలో జోరు.. గత ఏడాది కంటే 74% పెరుగుదల..

First Published Sep 25, 2021, 4:09 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ 22 సెప్టెంబర్ నాటికి 5,70,568 కోట్లకు పెరిగి 74.4% పెరుగుదల నమోదు చేసింది, అయితే  గత ఆర్థిక సంవత్సరంలో  ట్యాక్స్ కలెక్షన్ రూ.3,27,174 కోట్లగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శుక్రవారం తెలిపింది.అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 22 సెప్టెంబర్ నాటికి నెట్ కలెక్షన్ రూ. 4,48,976 కోట్లు అని గత ఆర్ధిక సంవత్సరంలో నెట్ కలెక్షన్ రూ.4,48,976 కోట్లుగా ఉందని  మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 

నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూ. 5,70,568 కోట్లలో  కార్పొరేషన్ పన్ను (CIT) రూ. 3,02,975 కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను (PIT)తో సెక్యూరిటీ లావాదేవీ పన్ను (STT) రూ. 2,67,593 కోట్లుగా ఉంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్ ట్యాక్స్  గ్రాస్ కలెక్షన్ రూ. 6,45,679 కోట్లు అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 4,39,242 కోట్లుగా ఉంది అంటే గత సంవత్సరం కంటే 47% వృద్ధిని నమోదు చేశాయి. 
 

గత ఏడాది ఆర్ధిక సంవత్సరం 2019-20  కంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్రాస్ కలెక్షన్ 16.75% వృద్ధిని నమోదు చేసి 5,53,063 కోట్లుగా ఉంది.

గ్రాస్ కలెక్షన్ రూ. 6,45,679 కోట్లలో కార్పొరేషన్ పన్ను (CIT)రూ. 3,58,806 కోట్లుగా, సెక్యూరిటి లావాదేవీల పన్ను (STT) తో సహా వ్యక్తిగత ఆదాయ పన్ను (PIT) రూ. 2,86,873 కోట్లు ఉన్నాయి. 
 

2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలలు చాలా సవాలుగా ఉన్నప్పటికీ 2021-22 ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో అడ్వాన్స్ ట్యాక్స్ వసూలు రూ.1,72,071 కోట్లుగా ఉంది, 2020-21 ఆర్థిక సంవత్సరం ట్యాక్స్ కలెక్షన్ రూ. 1,13,571 కోట్ల కంటే  51.50% వృద్ధిని నమోదు చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి, రెండవ త్రైమాసికంలో  అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు రూ. 2,53,353 కోట్లు, గత ఆర్థిక సంవత్సరం 2020-21 సంబంధిత కాలానికి 1,62,037 కోట్లు కంటే  56%  వృద్ధిని చేసింది. 
 

  అడ్వాన్స్ ట్యాక్స్  మొత్తం రూ. 2,53,353 కోట్ల కలెక్షన్ లో  కార్పొరేషన్ పన్ను (CIT) రూ. 1,96,964 కోట్లు, వ్యక్తిగత ఆదాయపు పన్ను (PIT) రూ. 56,389 కోట్లు. బ్యాంకుల నుండి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నందున ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

click me!