'20 కోట్లు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాం, మాకు ఇండియాలోనే బెస్ట్ షూటర్లు ఉన్నారు'; ముఖేష్ అంబానీకి బెదిరింపులు..

First Published | Oct 28, 2023, 2:31 PM IST

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 20 కోట్లు ఇవ్వకుంటే అంబానీని చంపేస్తానని బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. 'మాకు రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం. మాకు భారతదేశంలో బెస్ట్  షూటర్లు ఉన్నారు" అని ఇమెయిల్ పేర్కొంది.

అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో ఈ-మెయిల్ మెసేజ్  వచ్చింది. ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలోని భద్రతా సిబ్బంది అంబానీకి ప్రాణహాని ఉందని తమ దృష్టికి తీసుకురావడంతో ఫిర్యాదు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు ముంబైలోని గామ్‌దేవి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్‌ 387, 506 (2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ముకేశ్ అంబానీకి ఇంతకుముందు కూడా హత్యచేస్తామంటూ  బెదిరింపులు వచ్చాయి. ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు బెదిరింపు ఫోన్‌లు చేసినందుకు గాను గతేడాది బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ముంబైలోని  యాంటిలియాతో పాటు హెచ్ ఎన్  రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని బెదిరించాడు. అంబానీ నివాసం దగ్గర 2021 ఓ ఎస్‌యూవీలో పేలుడు పదార్థాలు దొరికాయి.  

Latest Videos

click me!