భారతదేశంలోని యువత వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు

Ashok Kumar | Published : Oct 28, 2023 1:47 PM
Google News Follow Us

 భారతదేశంలోని యువత వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి సూచించారు. దీంతో పెద్ద చర్చ మొదలైంది. నేషనల్ వర్క్ కల్చర్ ని పెంపొందించడానికి,  ప్రపంచ స్థాయిలో సమర్ధవంతంగా పోటీపడేలా ఒక కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది.
 

15
 భారతదేశంలోని యువత వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండాలి: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు

3one4 క్యాపిటల్ పోడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశ కార్మిక ఉత్పాదకతను మార్చాల్సిన అవసరం గురించి మాట్లాడారు. భారతదేశంలోని యువత ఎక్కువ పనిగంటలకు విలువ ఇవ్వకపోతే, దేశం ఆర్థికంగా కష్టపడుతుందని ఆయన వాదించారు.
 

25

ఇన్ఫోసిస్ మాజీ CFO మోహన్‌దాస్ పాయ్‌తో సంభాషణలో  నారాయణ మూర్తి భారతదేశ కార్మిక ఉత్పాదకతను కూడా ఎత్తి చూపారు,  దీనిలో ప్రపంచంలోనే అత్యల్ప స్థానంలో ఉంది. ప్రభుత్వ అవినీతి, బ్యూరోక్రాటిక్ అసమర్థతతో సహా భారతదేశ పురోగతికి ఇతర అడ్డంకులు కూడా చర్చించబడ్డాయి. భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఎదగడానికి ఈ అడ్డంకులను తొలగించాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.
 

35

నేటి యువత దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశం మన దేశమని, వారానికి కనీసం 70 గంటలు పని చేయాలని యువతను కోరుతున్నానని, మెజారిటీ జనాభా కూడా యువతేనని, దేశాన్ని నిర్మించగలరని నారాయణ మూర్తి అన్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

45

నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ ఇప్పటికే  స్పందించారు. అగర్వాల్ కూడా ఈ ఆలోచనలతో ఏకీభవిస్తూ తెరపైకి వచ్చారు. బలమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రస్తుత కాలం అంకితభావం,  కమిట్మెంట్ కోసం పిలుస్తుందని ఆయన అన్నారు. 
 

55

అగర్వాల్ "నారాయణ మూర్తి  అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నాను,  తక్కువ పని చేసి ఆనందించాల్సిన తరుణం ఇది కాదు. దీనికి బదులుగా ఇతర దేశాలు అనేక తరాలలో నిర్మించిన వాటిని ఒక తరంలో నిర్మించడానికి ప్రయత్నించాల్సిన సమయం ఇది."అని అన్నారు. 

Recommended Photos