ప్రపంచంలోనే బెస్ట్ విస్కీగా ఇండియన్ బ్రాండ్.. 14 నేషనల్ అవార్డులు కూడా.. దీని రేటు ఎంతో తెలుసా..

First Published | Oct 28, 2023, 2:14 PM IST

ఢిల్లీ: ప్రపంచంలోనే బెస్ట్ విస్కీగా భారతీయ బ్రాండ్ ఎంపికైంది. ఎన్నో రౌండ్ల రుచి(taste) పరీక్షల(testing) తర్వాత భారతదేశం సింగిల్ మాల్ట్ విస్కీ పేరు ఇంద్రి (Indri) ప్రపంచంలోని అగ్రస్థానానికి చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ రుచి పరీక్ష కొద్ది రోజుల క్రితం పూర్తయింది. హర్యానాలో తయారైన ఇంద్రి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి 100 కంటే ఎక్కువ విస్కీలతో పోటీ పడింది.
 

స్కాచ్, బోర్బన్, కెనడియన్, ఆస్ట్రేలియన్, బ్రిటిష్ సింగిల్ మాల్ట్‌లను ఇంద్రి బ్రాండ్ విస్కీ ఓడించింది. ఇంద్రి విస్కీని 2021లో లాంచ్  చేసారు. ఇంద్రి విస్కీని హర్యానాలోని పికాడిల్లీ డిస్టిలరీస్(Piccadilly Distilleries) తయారుచేసింది. భారతదేశపు మొట్టమొదటి ట్రిపుల్ బ్యారెల్ సింగిల్ మాల్ట్ కూడా ఇంద్రి విస్కీ. గత రెండేళ్లలో ఇంద్రి విస్కీ 14 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇంద్రి విస్కీకి  ప్రస్తుతం అంతర్జాతీయంగా సింగిల్ మాల్ట్ విస్కీ రుచికి భారతదేశం పేరు తీసుకువచ్చిన ప్రత్యేకత ఉంది.
 

అంతేకాకుండా, అమృత్ డిస్టిలరీస్ విస్కీలు కూడా ఈ పోటీలో నిలిచాయి. ఇంద్రి  విస్కీ ఇప్పటికే దేశంలోని 19 రాష్ట్రాలు, ప్రపంచంలోని 17 దేశాలలో ప్రసిద్ధి చెందింది. మారుతున్న లైఫ్ స్టయిల్ కారణంగా దేశంలో విస్కీ వినియోగం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.


అంతకుముందు, దేశంలోని అగ్రగామి మద్యం తయారీ సంస్థ అలైడ్ బ్లెండర్స్ అండ్  డిస్టిల్లర్స్ ప్రైవేట్ రష్యా మార్కెట్లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్ దండయాత్ర తర్వాత, రష్యా నుండి వైదొలిగిన పాశ్చాత్య మద్యం బ్రాండ్‌లకు బదులుగా భారతీయ బ్రాండ్ రష్యన్ మార్కెట్‌లోకి వచ్చింది.

Latest Videos

click me!