క్యూఎస్ఆర్ బిజినెస్ పై ముకేష్ అంబానీ కన్ను.. త్వరలోనే రిలయన్స్ రిటైల్ చేతికి సబ్‌వే..

First Published Aug 3, 2021, 12:33 PM IST

మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రెస్టారెంట్ చైన్ సబ్‌వే  ఇంక్  భారతీయ ఫ్రాంచైజీని కొనుగోలు చేయనుంది. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) వ్యాపారం పై దృష్టిపెట్టారు. 

సబ్‌వే ప్రధాన కార్యాలయం యూ‌ఎస్‌ఏలోని కనెక్టికట్‌లో ఉంది. భారతదేశంలో కంపెనీ వ్యాపారాన్ని అనేక స్థానిక మాస్టర్ ఫ్రాంచైజీల ద్వారా నిర్వహిస్తుంది.  ఒక వార్తా పత్రిక  ప్రకారం ఈ డీల్ విలువ  200 మిలియన్ డాలర్ల నుండి 250 మిలియన్ డాలర్ల మధ్య అంటే రూ .1,488 కోట్ల నుండి రూ .1,860 కోట్ల మధ్య ఉండవచ్చని వర్గాలు చెబుతున్నాయి.

డొమినో, పిజ్జా హట్, బర్గర్ కింగ్, పిజ్జా, స్టార్‌బక్స్  అండ్  లోకల్ పార్ట్నర్ టాటా గ్రూప్, జూబిలెంట్ గ్రూప్ ఈ ఒప్పందం తర్వాత ఈ కంపెనీలు నేరుగా రిలయన్స్ రిటైల్‌తో పోటీపడనున్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు ఇప్పటికే శాండ్విచ్ తయారీదారి సబ్‌వే  లోకల్ ఫ్రాంచైజ్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ డీల్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్  రిటైల్ యూనిట్ భారతదేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 600 సబ్‌వే స్టోర్‌లను సొంతం చేసుకుంటుంది. సబ్‌వే సింగిల్ పార్ట్నర్ ద్వారా భారతదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటుంది.

ఢిల్లీకి చెందిన చేతన్ అరోరా, సచిన్ అరోరా, మన్‌ప్రీత్ గులారి, రిషి బజోరియా గుల్‌ప్రీత్ గులారి, రాహుల్ భల్లా భారతదేశంలో సబ్‌వేకి ప్రధాన అభివృద్ధి ఏజెంట్లు. యుఎస్ ఆధారిత రెస్టారెంట్ మాస్టర్ ఫ్రాంచైజీలచే నియమించిన సబ్-ఫ్రాంచైజీల ద్వారా స్టోర్లను నిర్వహిస్తుంది. డాబర్ ప్రమోటర్ అమిత్ బర్మన్  లైట్ బైట్ ఫుడ్స్ కూడా ఇందులో చేర్చబడింది.

 సబ్‌వే ప్రస్తుతం డాక్టర్స్ అసోసియేట్స్ యాజమాన్యంలో ఉంది. ఈ సంస్థ ప్రతి ఫ్రాంఛైజీ నుండి ఎనిమిది శాతం ఆదాయాన్ని తీసుకుంటుంది. భారతదేశంలో రూ .18,800 కోట్ల విలువైన ఆర్గనైజ్డ్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్లలో  6 శాతం వాటాను కలిగి ఉంది. డొమినోస్ 21 శాతం వాటాతో మార్కెట్ లీడర్ గా ఉంది. దీని తర్వాత 11 శాతం వాటాతో మెక్‌డొనాల్డ్స్ ఉంది.

click me!