ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025 విడుదలైంది. ఇండియాలో మొత్తం బిలియనీర్ల సంఖ్య లాస్ట్ ఇయర్ కంటే కొంచెం పెరిగింది. గతంలో 200 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 205కి పెరిగింది. వీళ్లందరి దగ్గర ఉన్న ఆస్తుల నికర విలువ ఏకంగా 941 బిలియన్ డాలర్లు. అయితే లాస్ట్ ఇయర్ ఈ జాబితాలో ఉన్న 200 మంది బిలియనీర్ల ఆస్తుల నికర విలువ 954 బిలియన్ల డాలర్లు. ఈ ఏడాది బిలియనీర్ల సంఖ్య పెరిగినా వారి మొత్తం ఆస్తుల నికర విలువ మాత్రం తగ్గింది.
ఫోర్బ్స్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఇండియాలో ఇప్పుడు 205 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇందులో ముఖేష్ అంబానీ భారతదేశానికి చెందిన ముకేష్ అంబానీ టాప్ 10 లిస్టులో లేరు. ముఖేష్ అంబానీ కంపెనీల షేర్లు పడిపోవడం వల్ల ఆయన ఆస్తి 20 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ తగ్గిపోయింది.
అంబానీ రూ.7.85 లక్షల కోట్ల ఆస్తులతో 18వ స్థానంలో ఉన్నారు. ఇండియాలో మాత్రం ఆయనే నంబర్ వన్ ధనవంతుడిగా కొనసాగుతున్నారు.
ఎప్పటిలాగే నంబర్ వన్ ఎలాన్ మస్క్
2025వ సంవత్సరంలో కూడా ఎలాన్ మస్క్ టాప్ లో ఉన్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ 342 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 2025వ సంవత్సరం కోసం ఫోర్బ్స్ బిలియనీర్ల లిస్టులో ప్రపంచవ్యాప్తంగా నుంచి 3,028 మంది ఉన్నారు. చరిత్రలో ఫస్ట్ టైమ్ ఈ సంవత్సరంలోనే బిలియనీర్ల సంఖ్య 3,000 దాటింది. వాళ్ల మొత్తం ఆస్తుల విలువ 16.1 ట్రిలియన్ డాలర్లుగా రికార్డ్ అవడం మరో విశేషం.
సెకండ్ ప్లేస్ లో జుకర్ బర్గ్
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫస్ట్ టైమ్ సెకండ్ ప్లేస్‌కి ఎదిగారు. అతని ఆస్తుల నికర విలువ 216 బిలియన్ డాలర్లు. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఉన్న అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌ను, ఫోర్త్ ప్లేస్ లో ఉన్న ఒరాకిల్ లారీ ఎలిసన్‌ను అతను దాటేశారు.
ఫోర్బ్స్ లిస్టులో 10 మంది ధనవంతులైన భారతీయులు వీరే..
ముఖేష్ అంబానీ (నికర విలువ $92.5 బిలియన్లు)
గౌతమ్ అదానీ (నికర విలువ $56.3 బిలియన్లు)
సావిత్రి జిందాల్ & కుటుంబం (నికర విలువ $35.5 బిలియన్లు)
శివ్ నాడార్ (నికర విలువ $34.5 బిలియన్లు)
దిలీప్ షాంగ్వి (నికర విలువ $24.9 బిలియన్లు)
సైరస్ పూనవల్లా (నికర విలువ $23.1 బిలియన్లు)
కుమార్ బిర్లా (నికర విలువ $20.9 బిలియన్లు)
లక్ష్మి మిట్టల్ (నికర విలువ $19.2 బిలియన్లు)
రాధాకిషన్ దమాని (నికర విలువ $15.4 బిలియన్లు)
కుశాల్ పాల్ సింగ్ (నికర విలువ $14.5 బిలియన్లు)