2025 ప్రారంభం నుండి కూడా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం ధరలు దాదాపు 20% పెరిగాయి. ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన విదేశీ దిగుమతి పన్నుల విధానంతో మరోసారి రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వాణిజ్య భాగస్వాముల పై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించడంతో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఆయన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బెంబేలెత్తిపోయారు. దీంతో సురక్షితమైన పెట్టుబడుల కోసం అందరూ బంగారం వైపు చూశారు. దీంతో బంగారం ధరలు పాత రికార్డును అధిగమించాయి. బంగారం ఔన్సు 3,145.93 డాలర్ల రేటును నమోదు చేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై దిగుమతి సుంకాలను పెంచేశారు. చైనా దిగుమతులపై 34%, యూరోపియన్ దేశాల వస్తువులపై 20%, జపనీస్ ఉత్పత్తులపై 24% పన్న విధించారు.
ట్రంప్ ప్రకటించిన పన్నుల జాబితాలో భారతదేశం 52% ట్యాక్స్ రేటును హైలైట్ చేశారు. దీనికి ప్రతిస్పందనగా "తగ్గింపు పరస్పర సుంకం" పేరుతో 26% విధించారు. ఇలాగే UKతో సహా ఇతర దేశాలు 10% సుంకాన్ని ఎదుర్కొన్నాయి.
ఈరోజు బంగారం ధర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన వాణిజ్య భాగస్వాములపై సుంకాలు పెంచడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని చూశారు. అందరికీ బంగారం ఒక్కటే సరైన, సురక్షితమైన పెట్టుబడి మార్గం అని తోచింది. దీంతో గురువారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్పాట్ బంగారం ఔన్సుకు 0.4% పెరిగి 3,145.93 డాలర్లకి చేరుకుంది.
భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.92,830గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర రూ.85,090గా ఉంది.
18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.69,620గా లభించింది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.9338, 22 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.8560గా నమోదైంది.
ఇది కూడా చదవండి ట్రంప్ టారిఫా? డోంట్ కేర్.. ఈ షేర్లు బాంబుల్లా పేలతాయ్!