Movie Tickets: ఓటీటీలు అందుబాటులోకి వచ్చినా థియేటర్లలో సినిమా చూడడంలో ఉండే కిక్కే వేరు. అయితే సినిమా టికెట్లను ఉచితంగా పొందే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! సినిమా టికెట్ లపై ఆఫర్లు అందించే కొన్ని క్రెడిట్ కార్డుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
BookMyShowలో సినిమా టిక్కెట్లు బుక్ చేసే వారికి హెచ్‌డీఎఫ్‌సీ టైమ్స్ కార్డ్ సరైన ఎంపిక. ఈ కార్డుతో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్‌పై రూ. 150 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఒక్క ట్రాన్సాక్షన్‌కు రూ. 350 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. నెలకు గరిష్ఠంగా నాలుగు టికెట్ల వరకు ఆఫర్ వర్తిస్తుంది. అదనంగా Times Prime Membership, ఇతర ఎంటర్టైన్‌మెంట్ డీల్‌లు కూడా లభిస్తాయి. తరచుగా సినిమాలు చూసే వారికి ఇది సూపర్ ఆప్షన్.
25
యాక్సిస్ మై జోన్ కార్డ్
Paytm ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి Axis My Zone Credit Card అత్యుత్తమ ఎంపికగా చెప్పొచ్చు. ఈ కార్డు ద్వారా ప్రతి నెలా ఒక ఫ్రీ సినిమా టికెట్ పొందొచ్చు. Zomato, Spotify, Myntra వంటి యాప్స్‌పై కూడా అదనపు క్యాష్‌బ్యాక్‌లు లభిస్తాయి.
35
ఎస్బీఐ ఎలైట్ క్రెడిట్ కార్డ్
సినిమాలు తరచుగా చూసేవారికి SBI Elite Credit Card అత్యుత్తమ ఎంపికగా చెప్పొచ్చు. ఈ కార్డు ద్వారా బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ అందిస్తున్నారు. ఒక్క టికెట్‌పై రూ. 250 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. నెలకు రెండుసార్లు ఆఫర్ లభిస్తుంది. ఈ విధంగా సంవత్సరానికి దాదాపు రూ. 6,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మూవీ లవర్స్‌కి ఇది సరైన ఆర్థిక ఎంపిక.
సినిమా థియేటర్‌కు అప్పుడప్పుడే వెళ్లే వారికి ICICI Coral Credit Card బాగా ఉపయోగపడుతుంది. ఈ కార్డుతో బుక్ మైషోలో బుక్ చేసుకుంటే 25% వరకు తగ్గింపు పొందొచ్చు. నెలకు రెండుసార్లు ఆఫర్ వర్తిస్తుంది. ఒక్క టికెట్‌పై రూ. 100 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా రెస్టారెంట్లలో ప్రత్యేక డైనింగ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.
55
స్మార్ట్ స్పెండింగ్
ఈ క్రెడిట్ కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుంటే ప్రతి నెలా సినిమా టికెట్లపై గణనీయమైన ఆదా సాధ్యమవుతుంది. సినిమా చూడటం కేవలం ఎంటర్టైన్‌మెంట్ మాత్రమే కాదు, ఇప్పుడు అది స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ కూడా అవుతుంది. అయితే ఎలాంటి కార్డ్ అయినా తీసుకునే ముందు దానికి సంబంధించిన నిబంధనలు, షరతులు జాగ్రత్తగా చదవడం మరవకండి.