దేశంలో ఎక్కువ మంది వాడే ఫోన్ ఏదో తెలుసా?

First Published | Aug 9, 2024, 12:10 AM IST

ప్రస్తుత ప్రపంచంలో సెల్ ఫోన్ లేని మనిషి ఉండడు అంటే అతిశయోక్తి కాదు.  ఎవరి చేతిలో చూసినా ఇది కనిపిస్తుంది. సోషల్ మీడియా ప్రారంభమైనప్పటి నుంచి సెల్ ఫోన్లకు వచ్చిన డిమాండ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సెల్ నిత్యావసర వస్తువుగానూ మారిపోయింది.  ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కువ మంది ఏ సెల్ ఫోన్ వాడుతున్నారో తెలుసుకుందామా.. 
 

డిజిటల్ రంగంలో సెల్ ఫోన్ ఓ మైలు రాయి. ఎయిర్ టెల్, ఒడాఫోన్-ఐడియా, రిలయన్స్ తదితర నెట్ వర్క్ లు ప్రజలకు ప్రస్తుతం నిరంతర సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో కాల్స్, ఎస్ఎంఎస్ లు, ఇంటర్ నెట్ సదుపాయాలను రోజులు, వారాలు, నెలల తరఫున అందిస్తున్న అనేక రకాల సెల్ కంపెనీలున్నాయి. శామ్ సంగ్, జియో, మోటొరోలా, ఒప్పో వంటి అనేక కంపెనీలు తరచూ అనేక మోడల్స్ ను డిజిటల్ మార్కెట్లోకి  తీసుకొస్తున్నాయి.
 

ఇటీవల టెలికాం పరిశ్రమలో టారిఫ్ ధరల పెరుగుదలలు కంపెనీల మధ్య తీవ్ర పోటీని నెలకొల్పాయి. బీఎస్ఎన్ఎల్ టాటా కంపెనీతో కలిసి తన నెట్ వర్క్ ను బలోపేతం చేసుకుంటుండగా, రిలయన్స్ జియో కూడా తమ కస్టమర్లు జారిపోకుండా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తోంది. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన పలు మోడల్స్ తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి భారతీయుడికి డిజిటల్ సేవలను అందించే లక్ష్యంతో జియోభారత్ ప్రారంభించామని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. 

Latest Videos


ముకేష్ అంబానీ ఏమన్నారంటే..
‘జియో భారత్ సబ్-రూ. 1,000 విభాగంలో 50 % మార్కెట్ షేర్‌ను సాధించింది. అంటే భారత్‌లో 25 కోట్ల మంది ఈ ఫోన్ ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ సేవలు అందించడానికి ఇది ప్రధాన అడుగు. జియో భారత్ కీపాడ్ స్మార్ట్ ఫోన్లోనే యూపీఐ, జియో సినిమా, జియో టీవీ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంచాం. అతి తక్కువ ధర కలిగిన  ఈ పరికరం వినియోగదారులను స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండానే డిజిటల్ సేవలు అందిస్తోంది.’ 

లేఖ ద్వారా అభినందనలు...
జియో భారత్ కీపాడ్ స్మార్ట్ ఫోన్ 2016లో ప్రారంభమైంది.  ఈ ఫోన్ సబ్-రూ. 1,000 విభాగంలో 50 % మార్కెట్ షేర్‌ను సాధించింది. అంటే ఆ విభాగంలో దేశవ్యాప్తంగా ఎక్కువమంది ఈ ఫోన్ వాడుతున్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకున్నందుకు షేర్‌హోల్డర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు.  ఫీచర్ ఫోన్ ధర వద్ద స్మార్ట్‌ఫోన్ అందించి జియో భారత్ దేశం ముందడుగు వేసేలా చేసిందన్నారు. దీనికి సహకరించిన షేర్ హోల్డర్లకు కంగ్రాచ్యులేషన్లు తెలిపారు. 

click me!