ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ ఎలా పొందాలి ? మీ కలల ఇంటిని నిర్మించుకోవడానికి ఇలా ప్రయత్నించండి!

First Published | Aug 7, 2024, 2:06 PM IST

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణంగా ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్స్  అందిస్తాయి. దీని వల్ల ప్రాథమికంగా మీరు తనఖాని భద్రపరచడానికి ఆర్థిక సామర్థ్యాన్ని ఉన్నారని అంగీకరించడం.  ఈ ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ? కొనుగోలు చేయబోయే ఆస్తి విలువ ఏ పరిధిలోకి వస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.

ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఎక్కువగా వడ్డీ రేట్ల పై లాక్-ఇన్ పీరియడ్‌తో అందించబడుతుంది. ఇది పెరుగుతున్న వడ్డీ రేట్ల గురించి చింతించకుండా భద్రతను అందిస్తుంది. మీరు కొనుగోలు చేయడానికి ఆస్తి(asset) కనుగొన్నప్పుడు, ఫైనాన్సియల్ ప్రొఫైల్ ఇప్పటికే ఎవాల్యుయేట్ చేసినందున లోన్  ప్రాసెస్ వేగంగా జరుగుతుంది.

అయితే, హెచ్చరికలు లేకుండా కాదు. ప్రీ-అప్రూవ్డ్ సాధారణంగా పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది, అంటే మూడు నుండి ఆరు నెలల వరకు. అదే సమయంలో ఈ ప్రీ-అప్రూవ్డ్ ఫైనల్  లోన్ ఆమోదానికి హామీ ఇవ్వదు.  

హోమ్ లోన్ పొందడానికి ఆస్తి డాకుమెంట్స్ చాలా అవసరం. అయితే, ఇల్లు కొనేందుకు వెతుకుతున్న వారికి ఇది చక్కటి అవకాశంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos


ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్ని ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ అని కూడా పిలుస్తారు. దరఖాస్తుదారుడి ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఆర్థిక స్థితి ఆధారంగా మంజూరు చేయబడుతుంది. ఇది దాదాపు 3 నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ టైంలోనే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇంటిని సెలెక్ట్ చేసుకోవాలి.
 

లాక్-ఇన్ వ్యవధిలో ఇల్లు సెలక్షన్ కాకపోతే, దరఖాస్తుదారుడు తాజా ఆదాయ డాకుమెంట్స్ లెండింగ్ సంస్థకు సమర్పించి, లోన్  దరఖాస్తును తిరిగి మూల్యాంకనం చేయాలి.

లోన్ జారీ  సమయంలో వడ్డీ రేటు, ప్రతినెలా వాయిదాలు, లోన్ కాలం మారవచ్చు. దీని ఆధారంగానే ఫైనల్ లోన్ నిబంధనలు నిర్ణయించబడతాయని కూడా గమనించాలి.

click me!