ప్రజల నుంచి పన్నులు వసూలు చేయని దేశాలేంటో తెలుసా?

First Published | Aug 8, 2024, 3:58 PM IST

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ముక్కు పిండి పన్ను వసూలు చేస్తుంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రకాలుగా టాక్స్ లు వేసేస్తుంటాయి. వస్తువు తయారు చేసినా, అమ్మినా పన్ను కట్టాల్సిందే. అయితే ప్రజల నుంచి ఎటువంటి పన్నులు వసూలు చేయకుండా ఉచితంగా సంక్షేమం, సదుపాయాలు కల్పిస్తున్న దేశాలు కొన్ని ఉన్నాయని తెలుసా.. ఆ దేశాల వివరాలేంటో తెలుసుకుందాం..

1.బహామాస్... అట్లాంటిక్ మహాసముద్రంలోని లుకేయన్ ద్వీప సమూహంలో ఒక దేశం బహామాస్. 4,12,628 మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఉత్పత్తి, పర్యాటకం, వ్యవసాయం, తయారీ రంగాలు ఇక్కడి ప్రజలకు ఆదాయ మార్గాలు. ఈ దేశంలో ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, మూలధన లాభాల పన్ను లేదా సంపద పన్ను వసూలు చేయరు. దీంతో ఇతర దేశాల ధనవంతులు, వ్యాపారులు ఇక్కడ నివసించేందుకు, వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 

2.బెర్ముడా...  ఇది 181 ద్వీపాలను కలిగి ఉన్న ఒక ద్వీప సమూహం. అత్యంత ముఖ్యమైన ద్వీపాలు వంతెనల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఈ ద్వీపసమూహాన్ని కనుగొన్న స్పానిష్ అన్వేషకుడు జువాన్ డి బెర్ముడెజ్ పేరు మీద బెర్ముడా పేరు పెట్టబడింది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు. సుమారు 64,000 మంది జనాభా ఇక్కడ నివస్తున్నారు. బెర్ముడా దాని పేరును బెర్ముడా ట్రయాంగిల్ అని మార్చింది.  అంతుచిక్కని విధంగా ఇక్కడ అనేక విమానాలు, పడవలు అదృశ్యమయ్యాయి. ఈ దేశం వారి ప్రజలపై ఆదాయపు పన్ను విధించదు. 


3.మొనాకో...  ఇది ఒక చిన్న రాష్ట్రం. ఇక్కడ కేవలం 39,050 మాత్రమే నివస్తున్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన మరియు అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటి. వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతి చిన్న సార్వభౌమ రాష్ట్రంగా మొనాకో నిలిచింది. మొనాకో యొక్క ప్రధాన ఆదాయ వనరులలో ఒకటి పర్యాటకం. ఈ దేశం కూడా వారి ప్రజలపై ఆదాయపు పన్ను విధించదు. 

4.కేమాన్ దీవులు.. ఇక్కడ నివసించే ప్రజలు ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్ను కట్టవలసిన అవసరం లేదు. విదేశీయులు ఎక్కువగా ఇక్కడకు వచ్చి వ్యాపారాలు చేస్తుంటారు. ఈ దేశంలో 84,738 మంది నివసిస్తున్నారు. నౌకాయానం, దిగుమతులు, పర్యాటకం ఇక్కడ ప్రధాన ఆదాయ మార్గాలు. 

5. బ్రూనై.. ఇది ఆగ్నేయాసియాలోని బోర్నియో ద్వీపంలో ఉంటుంది. భౌగోళికంగా రెండు విభాగాలుగా విభజింపబడి ఉంది. దక్షిణ చైనా సముద్రతీరానికి దగ్గరగా ఉంటుంది. బ్రూనై విస్తీర్ణంలో చిన్నదైనా సంపన్న దేశం.  క్రూడ్ ఆయిల్, సహజవాయువుల ఉత్పత్తుల ద్వారా ఈ దేశం అధికంగా ఆదాయం పొందుతోంది. సుమారు 4,00,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఈ దేశం కూడా వారి ప్రజలకు ఆదాయపు పన్ను మినహాయించింది. 

6. నౌరు.. మైక్రోనేషియాలో ఉండే ఈ ద్వీప దేశ ప్రజలకు ఆ ప్రభుత్వం ఆదాయ, వ్యక్తిగత పన్నులు మినహాయించింది. అయితే ప్రస్తుతం నౌరు దేశం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. నౌరు ప్రపంచంలోని మూడవ-చిన్న దేశం. వాటికన్ సిటీ, మొనాకో కంటే పెద్దది. 12,511 మంది ఇక్కడ నివసిస్తున్నారు. 

7. బహ్రెయిన్. . పశ్చిమ ఆసియాలోని ఒక ద్వీప దేశం బహ్రెయిన్. పెర్షియన్ గల్ఫ్‌లో ఉంది. 50 సహజ ద్వీపాలు కలిగిన చిన్న ద్వీప సమూహం ఈ దేశం. బహ్రెయిన్ జనాభా 1,501,635.  మాల్దీవులు, సింగపూర్ తర్వాత ఆసియాలో మూడవ అతి చిన్న దేశంగా నిలిచింది. చమురు వనరులు, పర్యాటకం, విదేశాలతో వ్యాపారాలు ప్రధాన ఆదాయ వనరులు కాగా, ఇక్కడ ప్రజలకు ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయించింది. 

8. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)..  పశ్చిమ ఆసియాలోని ఒక దేశం ఇది. అరేబియా ద్వీపకల్పానికి తూర్పు వైపు ఉంది. ఇది చమురు, సహజ వాయువు నిల్వలను కలిగి ఉంది. విదేశాలకు వాటిని విక్రయించడం ద్వారా అధిక ఆదాయం పొందుతోంది. ఈ దేశ జనాభా 9,282,410 కాగా, ఇక్కడి నివాసితులు ఇన్ కమ్ టాక్స్ కట్టవలసిన అవసరం లేదు. 

Latest Videos

click me!