Balance Check With Missed Call: మిస్డ్ కాల్ ఇస్తే బ్యాంక్ బ్యాలెన్స్ తెలుస్తుంది.. నెంబ‌ర్లు ఇవే

Published : Jul 25, 2025, 09:04 PM IST

Missed Call for Bank Balance Check: ప్రముఖ బ్యాంకులు మిస్డ్ కాల్ సేవతో ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసే సదుపాయం అందిస్తున్నాయి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో సులభంగా బ్యాంకు బ్యాలెన్స్ తో పాటు మినీ స్టేట్‌మెంట్ వివరాలు పొంద‌వచ్చు.

PREV
15
మిస్డ్ కాల్‌తో ఇలా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌చ్చు

కొత్త టెక్నాల‌జీ రాక‌తో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా సులభం అయింది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే, కేవలం మిస్డ్ కాల్ ద్వారా ఖాతా వివరాలు పొందవ‌చ్చు. భారత్ లోని చాలా బ్యాంకులు ఈ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ సేవలను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తున్నాయి.

మిస్డ్ కాల్ బ్యాలెన్స్ సేవలు ఎలా పనిచేస్తాయి?

ఈ సేవ ద్వారా ఖాతాదారులు తమ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుండి, బ్యాంక్ నిర్దేశించిన ప్రత్యేక నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీంతో వెంట‌నే మీకు బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ సమాచారం ఉన్న SMS వస్తుంది.

  • కాల్ రింగ్ అయిన వెంటనే కట్ అవుతుంది.
  • కొద్ది క్షణాల్లో బ్యాలెన్స్ డేటా తోపాటు మెసేజ్ వస్తుంది.
  • దీనికి ఇంటర్నెట్ కనెక్షన్, యాప్ అవసరం లేదు.
  • ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి.
25
బ్యాంకులు- బ్యాలెన్స్ తెలుసుకునే మిస్డ్ కాల్ నంబర్లు

ప్రభుత్వ రంగ బ్యాంకులు

SBI: బ్యాలెన్స్ చెక్ కోసం 09223766666, మినీ స్టేట్‌మెంట్ కోసం 09223866666

సెంట్రల్ బ్యాంక్: బ్యాలెన్స్ కోసం 9555244442, మినీ స్టేట్‌మెంట్ కోసం 9555144441

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: బ్యాలెన్స్ చెక్ 98333 35555, మినీ స్టేట్ మెంట్ 72878 88886

ఇండియన్ బ్యాంక్: 96776 33000

కెనరా బ్యాంక్: 8886610360, మినీ స్టేట్‌మెంట్ కోసం 09015734734

బ్యాంక్ ఆఫ్ బరోడా: బ్యాలెన్స్ చెక్ 8468001111, మినీ స్టేట్‌మెంట్ కోసం 8468001122

బ్యాంక్ ఆఫ్ ఇండియా: 09266135135 / 09015135135

ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్: 09289222029 / 09210622122

యూనియన్ బ్యాంక్: బ్యాలెన్స్ చెక్ 09223008586

పంజాబ్ నేషనల్ బ్యాంక్: 18001802223

35
ప్రైవేట్ బ్యాంకులు-బ్యాలెన్స్ తెలుసుకునే మిస్డ్ కాల్ నంబర్లు

HDFC: బ్యాలెన్స్ చెక్ 18002703333

ICICI: బ్యాలెన్స్ చెక్ 9594612612, మినీ స్టేట్‌మెంట్ 9594613613

కోటక్ మహీంద్రా బ్యాంక్: 1800 270 7300

బంధన్ బ్యాంక్: బ్యాలెన్స్ చెక్ 09223008666, మినీ స్టేట్‌మెంట్ కోసం 09223008777

RBL బ్యాంక్: 18004190610

సౌత్ ఇండియన్ బ్యాంక్: 09223008488

ఫెడరల్ బ్యాంక్: బ్యాలెన్స్ చెక్ 8431900900, మినీ స్టేట్‌మెంట్ కోసం 8431600600

కరూర్ వైశ్యా బ్యాంక్: బ్యాలెన్స్ చెక్ 09266292666, మినీ స్టేట్‌మెంట్ కోసం 09266292665

DCB బ్యాంక్: బ్యాలెన్స్ చెక్ 7506660011, మినీ స్టేట్‌మెంట్ కోసం 7506660022

గమనిక: పైన పేర్కొన్న ఫోన్ నంబర్ల వివరాలు మరోసారి బ్యాంకు నుంచి  ధృవీక‌రించుకుని సేవలు పొందగలరు.

45
బ్యాంకుల‌ మిస్డ్ కాల్ సేవల ప్రత్యేకతలు ఏమిటి?
  • ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నారు. కాల్, SMSపై ఛార్జీలు ఉండవు. (కొన్ని బ్యాంకులకు వ‌ర్తించ‌వ‌చ్చు).
  • ఒక్కసారి రిజిస్టర్ చేసిన తర్వాత, నిరంతర సేవలు పొందవచ్చు.
  • ఒకే బ్యాంకులో ఒకకంటే ఎక్కువ ఖాతాలు ఉంటే, మొత్తం ఖాతాల బ్యాలెన్స్ ఒకేసారి చూపించ‌డం కొన్ని బ్యాంకుల్లో ఉంది.
  • దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు ఈ సేవను అందిస్తున్నాయి.
  • మిస్డ్ కాల్ నెంబ‌ర్ల‌ను బ్యాంకు అధికారుల నుంచి మాత్ర‌మే తీసుకోవాలి.
55
బ్యాంకింగ్ అభివృద్ధిలో మిస్డ్ కాల్ సేవల పాత్ర

ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ నోటిఫికేషన్లు, కాల్ సెంటర్ సపోర్ట్ వంటి ఆధునిక బ్యాంకింగ్ సౌకర్యాలకు తోడు, మిస్డ్ కాల్ సేవలు గ్రామీణ, తక్కువ కనెక్టివిటీ ప్రాంతాల్లో ఉన్న ఖాతాదారులకు ఎంతో మేలు చేస్తోంది. ఖాతాదారులు మరింత వేగంగా, సులభంగా తమ ఖాతాల వివ‌రాలు అందుకుంటారు.

ఈ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సేవలు 2025లో మరింత విస్తృతంగా విస్తరించాయి. వినియోగదారులు తమ బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లలోనూ సంద‌ర్శించి మ‌రిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories