ఉద్యోగాల తొలగింపు మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం శ్రామిక బలగంలో సుమారు 7%కు సమానం. 2014 తరువాత అత్యధిక తొలగింపులు చేసిన ఇదే కంపెనీ. అయితే, కంపెనీ స్టాక్ మాత్రం ఈ ఏడాది 21% పెరిగింది.
లేఆఫ్స్ అయిన కొందరు ఉద్యోగులు CNBCతో మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్‌లో పని చేసిన అనుభవాన్ని ప్రేమగా గుర్తు చేసుకుంటూనే.. ఉద్యోగం పోవడం బాధాకరమని తెలిపారు.
ఎన్ వీడియా తర్వాత మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో రెండవ అత్యంత విలువైన కంపెనీగా ఉంది. Windows, Office వంటి ఉత్పత్తులు ఇంకా మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, Azure క్లౌడ్ సేవలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
సత్య నాదెళ్ల తన మెమోలో చివరగా, "ఇది మేం కలిసి చేసిన ప్రయాణాన్ని పునర్విమర్శించే సమయం. ఇప్పటి స్థిరమైన పునాదికి వారే కారణం" అంటూ సంస్థ నుంచి తొలగించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే భవిష్యత్తులో మరిన్ని లేఆఫ్స్ ఉండవచ్చనే విషయం కాకుడా గ్రోత్ మైండ్‌సెట్ తో సంస్థలోని ఉద్యోగులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కంపెనీలు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విధానాలను స్వీకరించి తమ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా తిరిగి ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు ఉద్యోగులకు తగ్గించుకుంటున్నాయి. వారి స్థానంలో ఏఐ సేవలను ఉపయోగించుకుంటున్నాయి.