మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ సత్య నాదెల్లా మరో ఘనత.. కంపెనీ చైర్మన్ గా కీలక భాధ్యతలు..

First Published Jun 17, 2021, 11:35 AM IST

భారతీయ సంతతికి అమెరికన్ సిటిజెన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల కొత్త విజయాల నిచ్చెనను అధిరోహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ బుధవారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సత్య నాదెల్లను కంపెనీ అధ్యక్షుడిగా నియమించింది. 

జాన్ థాంప్సన్ స్థానంలో ఇప్పుడు సత్య నాదెల్ల మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించి సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ సమాచారం ఇచ్చింది. సత్య నాదెల్ల 2014 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు చేపట్టారు. దీని తరువాత లింక్డ్ఇన్, న్యూనస్ కమ్యూనికేషన్స్ అండ్ జెనిమాక్స్ వంటి అనేక కంపెనీల కొనుగోలులో సత్య నాదెల్లా కీలక పాత్ర పోషించారు.
undefined
కంపెనీ ఛైర్మన్‌గా సత్య నాదెల్ల నియామకం గురించి తెలియజేస్తూ మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. సీఈఓగా ఉన్న సత్య నాదెల్ల ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కొత్త ఛైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. సత్య నాదెల్లకు ముందు జాన్ థాంప్సన్ కంపెనీ చైర్మన్ గా ఉన్నారు. జాన్ థాంప్సన్ ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కొనసాగుతారు. 2014లో బిల్ గేట్స్ తరువాత థాంప్సన్ మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా వచ్చాడు.
undefined

Latest Videos


మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కంపెనీ బోర్డు నుండి వైదొలగరు. అతను బిల్ అండ్ మెలిండా గేట్స్ దాతృత్వ పనులపై దృష్టి సారించారు.
undefined
సత్య నాదెల్లా స్కూలింగ్సత్య నాదెల్ల 1967లో భారతదేశంలోని హైదరాబాద్‌లో జన్మించారు. అతని తండ్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, తల్లి సంస్కృత లెక్చరర్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి విద్యను పూర్తి చేసిన తరువాత 1988లో మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. దీని తరువాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. అతను 1996లో చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎం‌బి‌ఏ పూర్తి చేసాడు.
undefined
click me!