ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. యుఎఎన్ - ఆధార్ లింకింగ్ గడువు పొడగింపు..

First Published Jun 16, 2021, 5:58 PM IST

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. యూనివర్సల్ అక్కౌంట్ నంబర్ (యూ‌ఏ‌ఎన్) తో తప్పనిసరి ఆధర్ అనుసంధానం తుది గడువును పొడిగించింది.

ఇంతకుముందు జూన్ 1 వరకు ఉన్న యుఎఎన్ - ఆధార్ లింకింగ్ గడువును తాజాగా ఈపీఎఫ్ఓ సెప్టెంబర్ 1 వరకు అంటే మరో మూడు నెలల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
undefined
కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అభ్యర్థన మేరకు పొడిగింపుకు ఆదేశించిందని ఈ విషయం తెలిసిన సన్నిహితవర్గాలు చెప్పారు.
undefined
కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఇపిఎఫ్ చందాదారులు ఎదుర్కొంటున్న ఆసౌకర్యాల గురించి కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్‌కు పలు ప్రాతినిధ్యం వహించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
undefined
జూన్ 15 తుది గడువు పొడిగింపుకు సంబంధించి ఒక సర్క్యులర్ ని కూడా ఈ‌పి‌ఎఫ్‌ఓ జారీ చేసింది. ​​220 మిలియన్లకు పైగా ఖాతాలు, 12 లక్షల కోట్ల కార్పస్ కలిగిన ఈ‌పి‌ఎఫ్‌ఓ ​​ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి.
undefined
ఈపీఎఫ్‌వో సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 142లో కొన్ని మార్పులు చేసింది. ఈసీఆర్ దాఖలు చేసే నియమాలు, విధానంలో సవరణలు చేసింది. ఒకవేల ఆధార్ తో మీ ఖాతా లేదా యుఎఎన్ నెంబర్ లింకు చేయకపోతే మీ ఖాతాలో కంపెనీలు అందజేసే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను నిలిపివేసే అవకాశం ఉంది.
undefined
కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియాలో భాగస్వామి సరస్వతి కస్తూరిరంగన్ “ ఉద్యోగులు ఈ పొడిగించిన సమయంలో ఆధర్ లింక్ చేయడానికి ఉపయోగించుకోవాలి. అలాగే దీనిపై సంస్థలు ఉద్యోగులకు సమాచారం అందించాలి. ఇంకా ఆధర్ లింకింగ్ ఎలా చేయవచ్చనే దానిపై మార్గదర్శకత్వం కూడా అందించాల్సి ఉంటుంది. ”అని అన్నారు.
undefined
click me!