బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మైక్రోమాక్స్ ఇన్1 వచ్చేసింది.. తక్కువ ధరకే లేటెస్ట్ ఫీచర్స్..

First Published Mar 19, 2021, 2:18 PM IST

దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ  మైక్రోమాక్స్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ మైక్రోమాక్స్ ఇన్1 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మైక్రోమాక్స్ ఇన్1 కంపెనీ నుండి వస్తున్న కొత్త సిరీస్‌లోని  స్మార్ట్ ఫోన్. 

మైక్రోమాక్స్ ఇన్1 5000mAh భారీ శక్తివంతమైన బ్యాటరీతో వస్తుంది, అలాగే 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే మీరు ఈ ఫాస్ట్ ఛార్జర్‌ను బాక్స్‌లోనే ఫోన్‌తో పొందుతారు. మైక్రోమాక్స్ ఇన్ 1 స్మార్ట్ ఫోన్ పోకో ఎం3, రెడ్‌మి 9 ప్రైమ్ వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది. ఈ ఫోన్ పర్పుల్, బ్లూ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
undefined
మైక్రోమాక్స్ ఇన్1 స్పెసిఫికేషన్లుస్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే మీకు దీనిలో స్టాక్ ఆండ్రాయిడ్ లభిస్తుంది ఇది ఆండ్రాయిడ్ 10. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ నాచ్ డిస్‌ప్లే, రిజల్యూషన్ 2400x1080 పిక్సెల్స్ తో వస్తుంది. వైడ్‌విన్ ఎల్ -1 కూడా ఫోన్‌కి సపోర్ట్ చేస్తుంది, అంటే మీరు నెట్‌ఫిలిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల హెచ్‌డి వీడియోలను హాయిగా చూడగలుగుతారు. ఫోన్‌లో ఎలాంటి ప్రీ ఇంస్టాల్డ్ బ్లాగ్‌వేర్ యాప్స్ ఉండవు. ఇది కాకుండా ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి 80 ప్రాసెసర్ ఉంది, 4 జీబీ 6 జీబీ ర్యామ్, 64 జీబీ 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి, వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 256 జీబీకి పెంచవచ్చు. రాబోయే రెండేళ్లకు ఈ ఫోన్‌కి అప్‌డేట్ వస్తుంది.
undefined
మైక్రోమాక్స్ ఇన్1 కెమెరాకెమెరా గురించి మాట్లాడితే ఈ మైక్రోమాక్స్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్, ఎపర్చరు ఎఫ్ 1.79. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, మూడవ లెన్స్ 2 మెగాపిక్స్ మాక్రో కెమెరా. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. హెచ్‌డి‌ఆర్, నైట్ మోడ్, ప్రో వంటి మోడ్‌లు కెమెరాతో అందుబాటులో ఉన్నాయి. కెమెరాతో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అందుబాటులో ఉంది. ఫ్రంట్ కెమెరాలో నైట్ మోడ్ కూడా ఉంది.
undefined
మైక్రోమాక్స్ ఇన్1 బ్యాటరీబ్యాటరీ చూస్తే మైక్రోమాక్స్ ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీని ఇచ్చింది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌తో బాక్స్‌లో 18W ఛార్జర్ లభిస్తుంది. కవర్, స్క్రీన్ ప్రొటెక్టర్, సిమ్ కార్డ్ ఎజెక్టర్, యూజర్ మాన్యువల్ కూడా బాక్స్‌లో లభిస్తాయి. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 4 జి, డ్యూయల్ సిమ్, మూడు కార్డ్ స్లాట్లు, వెనుక ప్యానెల్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, వై-ఫై, విఒ వై-ఫై, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
undefined
మైక్రోమాక్స్ ఇన్1 ధరమైక్రోమాక్స్ ఇన్1 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 10,499 రూపాయలు. 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 11,999 రూపాయలు. ఈ ఫోన్ మార్చి 26 నుండి ఫ్లిప్‌కార్ట్ విక్రయించనున్నారు. మీరు మొదటి రోజు అంటే మార్చి 26న ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ రూ .9,999 కు లభిస్తుండగా, 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .11,499 కు లభిస్తుంది.
undefined
click me!