గతంలో కన్నా కూడా ప్రస్తుతం చాలా వరకు యూజ్డ్ కార్స్ అమ్ముడుపోతున్నాయి దీనికి కారణం ప్రొఫెషనల్ సంస్థలు సైతం ఈ రంగంలో కార్లను విక్రయిస్తున్నాయి. నిపుణులైనటువంటి మెకానిక్ బృందం ఈ కార్లకు రేటింగ్ అందిస్తోంది.
Maruti Suzuki Swift VXI మహీంద్రా గ్రూప్ కంపెనీ మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇది సెకండ్ హ్యాండ్ కారు. 2010 మోడల్. వెబ్‌సైట్‌లో దీని ధర రూ. 2.45 లక్షలు మాత్రమే. యూజ్డ్ కార్లలో మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ డీల్ చేస్తుంది. ఈ కారు కూడా పాతదేనని, ఇది వెబ్‌సైట్‌లో అమ్మకానికి లిస్ట్ చేసి ఉంది.
2010 Maruti Suzuki Swift VXI
వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకార ఈ కారు పెట్రోల్ ఇంజన్, ఇది ఇప్పటివరకు 50 వేల కిలోమీటర్లు మాత్రమే నడిచింది. కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో పనిచేస్తుంది. ఇది మొదటి యజమాని సిల్వర్ కలర్ కారు. ఈ కారు నోయిడాలో ఉంది.
2012 మారుతి సుజుకి స్విఫ్ట్ VDI
వెబ్‌సైట్‌లో మరో మారుతి సుజుకి స్విఫ్ట్ కారు లిస్ట్ అయి ఉంది. ఇది 2012 మోడల్ కారు 2012 మారుతి సుజుకి స్విఫ్ట్ VDI. ఈ కారు డీజిల్ ఇంజిన్ కారు, 44 వేల కిలోమీటర్లు నడిచింది. ఇది మొదటి యజమాని చేతిలో నడిచిన కారు. బూడిద రంగులో ఉంటుంది. కారు ఘజియాబాద్‌లో ఉంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. దీని ధర రూ.2.75 లక్షలుగా నిర్ణయించారు.
2012 మారుతి సుజుకి స్విఫ్ట్ VDI
మారుతి సుజుకి స్విఫ్ట్ 2012 మారుతి సుజుకి స్విఫ్ట్ VDI ఘజియాబాద్ కాకుండా గురుగ్రామ్‌లో కూడా అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజన్ కలిగిన ఈ కారు 63 వేల కిలోమీటర్లు నడిచింది. ఇది మొదటి యజమాని మరియు వెండి రంగులో ఉంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. దీని ధర రూ.2.95 లక్షలు
ఇదిలా ఉంటే మీరు యూజ్డ్ కార్ కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి అనేక కార్ ప్లాట్ఫామ్స్ ను తనిఖీ చేయవచ్చు, మీకు నచ్చిన అన్ని ప్లాట్ ఫారంలలో మీరు యూజ్డ్ కార్స్ వివరాలను పొందవచ్చు.