కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ముద్ర రుణాలను అందిస్తోంది. ఈ రుణాలను తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు చక్కటి బిజినెస్ లను ప్రారంభించి మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. మీరు కూడా ముద్ర రుణాల ద్వారా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే, వెంటనే మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకుకు వెళ్లి ముద్ర రుణాలను అప్లై చేసుకుంటే మంచిది. తద్వారా మీరు సులభంగా ఎలాంటి తనఖా పెట్టకుండానే రుణం పొందే అవకాశం ఉంది. 50వేల రూపాయల నుంచి 10 లక్షల వరకు ముద్రా రుణాల ద్వారా మీరు బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు.
ఇప్పుడు ఏ వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా. అయితే డ్రై ఫ్రూట్స్ వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు డ్రై ఫ్రూట్స్ వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇది ఒక చక్కటి అవకాశం అనేది చెప్పవచ్చు. కరోనా అనంతరం చాలామందిలో ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల స్పృహ విపరీతంగా పెరిగింది. ఇమ్యూనిటీ కోసం డ్రైఫ్రూట్స్ తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు డ్రై ఫ్రూట్స్ వ్యాపారం ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయ మార్గం పొందే అవకాశం ఉంది.
అయితే డ్రై ఫ్రూట్ బిజినెస్ చేయడం కోసం మీరు మార్కెట్ గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రాంతంలో ఎలాంటి డ్రైఫ్రూట్ తినేందుకు జనం ఇష్టపడుతున్నారో, ముందుగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఉంటుంది. అలాంటి డ్రైఫ్రూట్స్ మీరు సప్లై చేసినట్లయితే, మంచి గిట్టుబాటు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లో బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, పిస్తా పప్పు తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.
మీరు డ్రై ఫ్రూట్ బిజినెస్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే, ఢిల్లీలో అతి తక్కువ ధరకే డ్రై ఫ్రూట్స్ లభిస్తాయన్న సంగతి తెలుసుకోవాలి. ఖారీబోలి మార్కెట్లో అతి తక్కువ ధరకే హోల్ సేల్ ధరలకే డ్రై ఫ్రూట్స్ లభిస్తాయి. ముఖ్యంగా బాదం విషయంలో ఇక్కడ చాలా తక్కువ ధరకే మీకు లభించే అవకాశం ఉంది. బాదం లో కూడా చాలా రకాలు ఉంటాయి. క్వాలిటీని బట్టి ధర మారుతూ ఉంటుంది ఇక్కడ బాదం కిలో ధర 300 రూపాయల నుంచి 7వేల రూపాయల వరకు ఉంటుంది.
ఇక జీడిపప్పు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లోని పలాస వేటపాలెం ప్రాంతాల్లో తక్కువ ధరకే జీడిపప్పు లభిస్తుంది. మీరు డ్రైఫ్రూట్స్ అమ్మాలి అనుకుంటే. వాటిని 100 గ్రాములు 200 గ్రాములు 250 గ్రాములు, 500 గ్రాములు ఒక కేజీ ప్యాకెట్ల చొప్పున ప్యాక్ చేసి విక్రయించడం ద్వారా మీరు కస్టమర్లకు సులభంగా డ్రై ఫ్రూట్స్ అమ్మవచ్చు.