ఇక్కడ మీ పాత బట్టలు అమ్మితే డబ్బులే డబ్బులు

First Published | Oct 9, 2024, 2:17 PM IST

మీకు కొత్త రకం డ్రెస్ లు, బట్టలంటే ఇష్టమా? షాపింగ్ వెళ్తే ఎక్కువగా వాటినే కొంటుంటారా? మరి ఒకసారి వేసిన డ్రెస్ లను మళ్లీ వేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు కదా? మీకు కూడా వాడిన క్లాత్స్ మళ్లీ వాడడం ఇష్టం లేకపోతే ఈ ఐడియా మీకోసమే. మీ పాత డ్రెస్ లు, ఫ్యాంట్, షర్ట్ లు, ఇలా ఏ రకమైనా ఆన్ లైన్ లో అమ్మేయొచ్చు. ఇవి ఎవరు కొంటారు? ఎక్కడ కొంటారు? ఎంతకు కొంటారు లాంటి మరిన్ని వివరాలకు ఈ కథనం పూర్తిగా చదవండి. 
 

చాలామందికి డ్రెసింగ్ సెన్స్ చాలా బాగుంటుంది. వాళ్లు ఎలాంటి బట్టలు వేసినా బాగుంటాయి. దీంతో అలాంటి వారు తరచూ కొత్త రకాల దుస్తులు కొంటుంటారు. ఒకసారి వాడిన దుస్తులు మళ్లీ వాడటానికి ఇష్టపడరు. దీంతో ఇళ్లలో డజన్లకొద్దీ బట్టలు పెరిగిపోతాయి. వాటిని మళ్లీ ఉపయోగించలేరు. బయట పడేయలేరు. ముఖ్యంగా ఈ సమస్య ఆడవాళ్లు ఫేస్ చేస్తుంటారు. 
 

ఆడవాళ్లకి రకరకాల డ్రెస్ లు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. సాధారణంగా వాళ్లు ఒకసారి వేసిన డ్రెస్ లు మళ్లీ వేయడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే మళ్లీ మళ్లీ బట్టలు కొంటుంటారు. కొత్త మోడల్స్ వచ్చినా వెంటనే కొనేస్తుంటారు. అందుకే ఆడవాళ్ల బీరువాలన్నీ డ్రెస్ లు, చీరలు, లాంటి వాటితో నిండిపోతాయి. ఇలా మీరు వాడకుండా పక్కన పెట్టేసిన దుస్తులను ఆన్ లైన్ లో అమ్మేయొచ్చు. ఇలాంటి వాటిని కొనేందుకు కొన్ని వెబ్ సైట్ లు ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. ఇక్కడ అలాంటి వెబ్ సైట్ల గురించి తెలుసుకుందాం. 
 


Meeshow(మీషో) భారత దేశంలో చాలా ప్రాచుర్యం పొందిన వెబ్ సైట్ ఇది. ఈ సైట్ లో మీరు పాత దుస్తులను విక్రయించవచ్చు. దేశవ్యాప్తంగా ఎవరైనా మీ దుస్తులను కొనుగోలు చేయడానికి ఈ వెబ్ సైట్ లో అవకాశం ఉంటుంది. 

Freeup(ఫ్రీఅప్) అనే వెబ్ సైట్ కూడా ఓల్డ్ డ్రెస్ లను కొనుగోలు చేసే ఫేమస్ వెబ్ సైట్. ఈ యాప్ లో మీరు మీ పాత బట్టల పిక్స్ పెట్టగానే వాటి క్వాలిటీని బట్టి ధర నిర్ణయిస్తుంది. ఆ ధర నచ్చితే మీరు హ్యాపీగా వాటిని అమ్మేయొచ్చు. 

Relove(రీలవ్) ఈ వెబ్ సైట్ కూడా మీ ఓల్డ్ డ్రెస్ లను కొనుగోలు చేస్తుంది. ఈ వెబ్ సైట్ ద్వారా మీరు ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవచ్చు. దీంతో మీ దుస్తులు త్వరగా సేల్ అవుతాయి. అంతేకాకుండా ఈ వెబ్ సైట్ నిర్వాహకులు మీ ఇంటికి వచ్చి మీరు అమ్మాలనుకున్న దుస్తులను తీసుకెళతారు. దీంతో మీకు బర్డెన్ కూడా తగ్గుతుంది. 

Klettad అనేది ప్రత్యేకంగా ఇంటింటికీ సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందిన యాప్. ఇందులో మీరు నమోదై, మీ వివరాలను అందించిన తర్వాత వెబ్ సైట్ నిర్వాహకులే మీరుండే చోటుకి వచ్చి మీ పాత దుస్తులను సేకరిస్తారు. వాటి బ్రాండ్, ప్రస్తుత పరిస్థితిని చూసి సరైన ధర నిర్ణయించి డబ్బులు కూడా అందిస్తారు. 

మీరే వ్యాపారం చేయొచ్చు
మీకు బిజినెస్ చేసే ఐడియా ఉంటే పాత బట్టలు అమ్మడాన్ని మీరే బిజినెస్ గా ప్రారంభించొచ్చు. దీనికోసం మీరు ఒక యాప్ గాని, వెబ్ సైట్ గాని తయారు చేసి సోషల్ మీడియా వేదికగా మీ వ్యాపారం ప్రారంభించొచ్చు. సిటీస్ లో మీ తరఫున సిబ్బంది పెట్టి బట్టలు కలక్ట్ చేయించండి. వాటిని రీసైక్లింగ్ చేసే కంపెనీలకు బల్క్ గా విక్రయించండి. ఈ పాత బట్టలను ఉపయోగించి కొందరు పిల్లోస్, పరుపులు, డెకరేషన్ ఐటమ్స్ తయారు చేస్తారు. అలాంటి వారిని కాంటాక్ట్ చేసి మంచి ధరకు అమ్మేయొచ్చు. దీని ద్వారా మీరు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. లేదా మీరే పాత దుస్తులతో  పరుపులు తయారు చేసే బిజినెస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు.

Latest Videos

click me!