చివరి నిమిషంలో ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడం ఎలాగో తెలుసా?

First Published | Oct 8, 2024, 11:40 PM IST

ట్రైన్ లో రిజర్వేషన్ సీట్ దొరకలేదా? జనరల్ లో కిక్కిరిసి ప్రయాణం చేయాలని టెన్షన్ పడుతున్నారా? ఏం అవసరం లేదు. ట్రైన్(Train) బయలుదేరడానికి కొన్ని గంటల ముందు మీరు కన్ఫర్మ్ టిక్కెట్ పొందొచ్చు. అదెలాగో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
 

జనరల్ గా మనం లాంగ్ టూర్ వెళ్లాలనుకున్నప్పుడు ట్రైన్ జర్నీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. ముందే ప్లాన్ చేసుకుంటే టిక్కెట్స్ కూడా ముందుగానే తీసుకుంటాం. ఇంత ప్లాన్ చేసినా తీసిన టిక్కెట్స్ చివరి నిమిషం వరకు కన్ఫర్మ్ కావు. అప్పుడు మనం పడే టెన్షన్ మామూలుగా ఉండదు. కొందరికైతే బీపీ పీచ్ స్టేజ్ కి వెళ్లిపోతుంది. ఇకపై ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ట్రైన్ బయలుదేరే కొన్ని గంటల ముందు మీరు కరెంట్ టిక్కెట్ ఆప్షన్ ద్వారా కన్ఫర్మ్ టిక్కెట్ పొందవచ్చు. 
 

కరెంట్ టికెట్ అంటే ఏమిటి?

కరెంట్ టికెట్ అంటే రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉండే ఒక ప్రత్యేక టికెట్ ఇది. ఈ టిక్కెట్ తీసుకోవాలంటే రైలు ప్రారంభానికి కొద్ది గంటల ముందు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా ఎక్కడికైనా వెళ్లినప్పుడు తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ఈ కరెంట్ టిక్కెట్ బుకింగ్ ఆప్షన్ మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. లాంగ్ వెళ్లేటప్పుడు ముందుగానే టిక్కెట్స్ తీసుకుంటాం. అయితే తిరుగు ప్రయాణంలో టిక్కెట్స్ కన్పర్మ్ కాక ఆందోళన పడుతుంటాం. అలాంటి సమయంలో ఈ కరెంట్ బుకింగ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. 
 

Latest Videos


కరెంట్ టికెట్ బుకింగ్ ఇలా..

ముందుగా IRCTC వెబ్‌సైట్ లేదా IRCTC మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ చేయండి. 
అప్లికేషన్ లో అడిగిన పర్సనల్ వివరాలు అన్నీ పూర్తి చేయండి. 
ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. 
కరెంట్ ఎవైలబులిటీ(Current Availability) ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. 
మీరు ఇప్పుడున్న స్టేషన్, వెళ్లాలనుకున్న స్టేషన్ వివరాలను నమోదు చేయండి.
కావలసిన ట్రైన్(ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్) క్యాటగిరీని ఎంచుకోండి.
ఇతర వివరాలు అన్ని పూర్తి చేసి ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా టిక్కెట్ డబ్బులు చెల్లించండి.
సక్సెస్‌ఫుల్‌గా బుక్ అయిన టికెట్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మీ ఇ-మెయిల్ ఐడీకి వస్తుంది.

IRCTC ఆఫిషియల్ మొబైల్ యాప్(Rail Connect)

రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని లాగిన్ చేయండి.
కరెంట్ బుకింగ్ కోసం Current Booking సెక్షన్‌లోకి వెళ్లి వివరాలను నమోదు చేయండి.
మీకు కావలసిన ట్రైన్, కేటగిరీని ఎంచుకోండి.
డబ్బు చెల్లింపు పూర్తయిన తర్వాత టికెట్ మొబైల్‌కు అందుతుంది.

రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ ద్వారా

రైల్వే స్టేషన్ లోని కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ కావాల్సిన వివరాలను అందించండి.
స్టేషన్లలో ఈ కరెంట్ టికెట్ కౌంటర్‌లు ప్రయాణం ప్రారంభానికి కొద్ది గంటల ముందు మాత్రమే ఓపెన్ అవుతాయి. 
టికెట్ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు టికెట్ స్లిప్ ఇస్తారు. 
 

ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి

కరెంట్ టికెట్ బుకింగ్ కేవలం ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కరెంట్ టికెట్‌లు సాధారణంగా కంఫర్మ్ అయినవే ఉంటాయి. తక్కువ ప్రయాణికుల సంఖ్య ఉన్న సమయంలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాసెస్ ద్వారా మీరు ట్రైన్ కరెంట్ టికెట్ సులభంగా బుక్ చేసుకోవచ్చు.

తత్కాల్ కంటే కరెంట్ బుకింగ్ చాలా బెస్ట్

తత్కాల్ టికెట్ పొందడం అంత సులభం కాదు. తత్కాల్ విండో తెరిచిన వెంటనే సాధారణ ప్రయాణీకులు తత్కాల్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ తర్వాతి నిమిషమే బుకింగ్ ఏజెంట్లు అన్ని తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. ఇంతే కాకుండా ప్రయాణీకులు సాధారణ టిక్కెట్లను వదిలి తత్కాల్, ప్రీమియం తత్కాల్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్ పొందడం కంటే కరెంట్ టికెట్ బుకింగ్ సమయం ద్వారా కన్ఫర్మ్డ్ టికెట్ పొందడం సులభం.

click me!