గ్యాస్ కస్టమర్లకు షాక్.. సిలిండర్ ధర పెంపు.. కొత్త ధరలు ఇవే..

First Published | Aug 1, 2024, 12:52 PM IST

ప్రతినెలా 1వ తేదీ నుంచి ప్రభుత్వం కొన్ని నిబంధనలలో మార్పులు చేర్పులు చేస్తుంటుంది. దీని వల్ల సామాన్యుల  ఖర్చులపై  ప్రభావం పడుతుంది. అయితే నేటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమైంది. ఎప్పటిలాగే ప్రభుత్వం ఈ నెలలో కొన్ని రూల్స్ మార్పులు చేసింది.

LPG సిలిండర్ల ధరలు మరోసారి  పెరిగాయి. బడ్జెట్ తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. ఈ కారణంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలు మారగా, 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.8.50 పెరిగింది.

IOCL వెబ్‌సైట్ ప్రకారం, వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ల కొత్త ధరలు ఆగస్టు 1, 2024 ఉదయం 6 గంటల నుండి అమల్లో ఉంటాయి. 
 

Latest Videos


సిలిండర్ ధరలు

ముంబైలో  కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచి  రూ. 1598 నుండి రూ.7 పెరిగి రూ.1605కి చేరుకుంది. చెన్నైలో LPG కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1809.50 నుండి రూ. 1817కి పెరిగింది.

ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,646 నుంచి రూ.1,652.50కి చేరి సిలిండర్‌పై రూ.6.50 పెరిగింది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1756 కాగా,  ఇప్పుడు రూ.8.50  రూ. 1764.5కు  ఎగిసింది. 

ఇక హైదరాబాద్, తెలంగాణలో 14.2 కిలోల వంటింటి గ్యాస్ ధర రూ.855, 19 కిలోల గ్యాస్ ధర రూ.1,872.50. 

అంతకుముందు జూలై 1న చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ ధరలను తగ్గించాయి. దింతో  ధరలు 19 కిలోల సిలిండర్ పై రూ.30 తగ్గింది.  

వంటింటి సిలిండర్ ధర 

ఒకవైపు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు నిరంతరం మారుతూ ఉంటే మరోవైపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వంటింటి  గ్యాస్ సిలిండర్ల ధరను చాలా కాలం పాటు స్థిరంగా కొనసాగిస్తున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై పెద్ద ఊరటనిస్తూ  ధరలను తగ్గించింది. దీని తరువాత వంటింటి ఎల్‌పిజి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు, ఢిల్లీలో 14 కిలోల సిలిండర్ ధర రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.

click me!