LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !

Published : Sep 20, 2026, 12:29 PM IST

LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. వంట గ్యాస్ సబ్సిడీని పొందుతున్న వినియోగదారులందరికీ అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. సబ్సిడీ సొమ్ము ఖాతాల్లో జమకావాలంటే ఏం చేయాలో తెలుసా?

PREV
15
ఎల్పీజీ సబ్సిడీ: అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్

దేశంలో డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ ధరకు గ్యాస్ రీఫిల్స్ పొందాలంటే ఆధార్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తప్పనిసరి. ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు వెంటనే దీనిని పూర్తి చేసుకోవాలని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ ఈ బయోమెట్రిక్ పూర్తి చేయకపోతే సబ్సిడీ లేని సాధారణ మార్కెట్ ధరకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

25
ఇప్పటికే 89.9 శాతం మంది పూర్తి

కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 19 నాటికి దేశవ్యాప్తంగా 27.43 కోట్ల మంది క్రియాశీల వినియోగదారులు బయోమెట్రిక్ ప్రాసెస్ పూర్తి చేశారు. అంటే దాదాపు 89.9 శాతం మంది వినియోగదారులు ఇప్పటికే ఈ ప్రక్రియను విజయవంతంగా ముగించారు. గతంలో జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరగా, ఆ తర్వాత జూలై 31, ఆగస్టు 7, 15, 23, 31, సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 14 వరకు గడువును పొడిగించారు. ఆల్ రెడీ బయోమెట్రిక్ పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన పనిలేదని ప్రభుత్వం తెలిపింది.

35
ఈజీగా ఆధార్ బయోమెట్రిక్ పూర్తి చేసే విధానాలు ఇవే

ఇంకా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ పూర్తి చేయని వారి కోసం కేంద్రం సులువైన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

• డెలివరీ సమయంలో: సిలిండర్ డెలివరీ ఇవ్వడానికి వచ్చే సిబ్బంది వద్ద ఉండే మొబైల్ యాప్ ద్వారా స్పాట్‌లోనే ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.

• డిస్ట్రిబ్యూటర్ వద్ద: నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీ / డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌కు వెళ్లి ఆధార్ ధ్రువీకరణ చేసుకోవచ్చు.

• ఆయిల్ కంపెనీల యాప్‌లు: ఇంట్లోనే ఉండి మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇండేన్ వినియోగదారులు IndianOil ONE, భారత్ గ్యాస్ వినియోగదారులు HelloBPCL, హెచ్ పీ గ్యాస్ వినియోగదారులు HP PAY యాప్‌లను వాడి ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.

45
బయోమెట్రిక్ చేయకపోతే ఏమవుతుంది?

ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయడానికి ఇష్టం లేని లేదా చేయలేని వినియోగదారులకు గ్యాస్ సేవలు నిలిచిపోవు. కానీ, వారు మార్కెట్ ధర చెల్లించి సబ్సిడీ లేని సిలిండర్లను మాత్రమే పొందగలరు. ఇలాంటి వారు తమ ఆప్షన్‌ను వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ చాట్‌బాట్ లేదా ఐవీఆర్ఎస్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి స్థానిక లభ్యతను బట్టి 5 కేజీలు లేదా 10 కేజీల సిలిండర్లు లభిస్తాయి. నకిలీ కనెక్షన్లను తొలగించడం, వాణిజ్య అవసరాలకు సబ్సిడీ సిలిండర్లను మళ్లించకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

55
భారీగా పెరుగుతున్న సబ్సిడీ భారం

ప్రభుత్వ లెక్కల ప్రకారం 14.2 కేజీల సిలిండర్‌పై ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.210 దాకా సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. జూన్ లో ఈ భారం ఏకంగా రూ.721 వరకు ఉంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నష్టాలను పూడ్చడానికి ప్రభుత్వం 2022-23లో రూ.22,000 కోట్లు విడుదల చేయగా, 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి రూ.30,000 కోట్ల చొప్పున చెల్లిస్తోంది. అయినా కూడా ఆగస్టు 31 నాటికి కంపెనీల బకాయిలు రూ.62,000 కోట్లు దాటాయి. మరోవైపు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, మౌలిక వసతులు అందుబాటులో ఉన్న 21.7 లక్షల మంది వినియోగదారుల్లో కేవలం 20 శాతం మాత్రమే పీఎన్‌జీ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories