Investment Rules: నష్టాలు రాకుండా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? వారెన్ బఫెట్ 5 సీక్రెట్ రూల్స్ ఇవే

Published : Sep 20, 2026, 10:45 AM IST

Investment Rules: ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ గా పేరుగాంచిన వారెన్ బఫెట్ షేర్ మార్కెట్ జర్నీ ప్రతి ఇన్వెస్టర్‌కు ఒక మార్గదర్శకం. మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా, ఆర్థిక మాంద్యం వచ్చినా కొన్ని రూల్స్ పాటించి సక్సెస్ అయ్యారు.

PREV
16
ఈ 5 సీక్రెట్స్ తెలిస్తే షేర్ మార్కెట్‌లో నష్టాలే ఉండవు

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన, ప్రముఖ ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్ బఫెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా బర్క్‌షైర్ హాథ్‌వే సంస్థను ముందుండి నడిపించిన ఆయన, ఇప్పుడు ఆ కంపెనీ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. 96 ఏళ్ల వయస్సు ఉన్న ఈ బిలియనీర్ నికర ఆస్తి విలువ మన భారతీయ కరెన్సీలో రూ. 13.89 లక్షల కోట్లు ($144.6 బిలియన్లు).

ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నప్పటికీ, ఆయన బోర్డు డైరెక్టర్‌గా మాత్రం కొనసాగుతారు. ఆయన కుమారుడు హావర్డ్ బఫెట్ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వారెన్ బఫెట్ అనగానే అందరికీ గుర్తుకువచ్చేది ఆయన పాటిచే 'వాల్యూ-ఇన్వెస్టింగ్' స్టైల్, క్రమశిక్షణతో కూడిన సంపద సృష్టి. పదవికి వీడ్కోలు పలుకుతూనే, సాధారణ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో ఎలా సక్సెస్ అవ్వాలో వివరిస్తూ 5 శక్తివంతమైన సీక్రెట్ సూత్రాలను అందించారు.

26
మార్కెట్ భయం, అత్యాశకు దూరంగా ఉండండి

బఫెట్ చెప్పే అత్యంత ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్ పాఠాలలో మొదటిది, "మిగతా మార్కెట్ అంతా అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి. అందరూ భయపడుతున్నప్పుడు మీరు ధైర్యంగా ముందుకు వచ్చి అత్యాశ చూపించండి." మార్కెట్‌లో అందరితో పాటు గుడ్డిగా ప్రయాణించకుండా ఉండటమే ఈ సూత్రం ముఖ్య ఉద్దేశ్యం. మార్కెట్ చాలా ఎత్తులో ఉన్నప్పుడు లేదా తీవ్రమైన పానిక్‌లో ఉన్నప్పుడు ఆ తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకూడదు. ఎమోషన్స్‌తో కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడమే ఇన్వెస్టర్లకు రక్షణగా నిలుస్తుంది.

36
మంచి వ్యాపారాలను సరైన ధరకే కొనండి

బఫెట్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతి ఎప్పుడూ చాలా సింపుల్ అండ్ డైరెక్ట్‌గా ఉంటుంది. మంచి కంపెనీలు లేదా వ్యాపారాల షేర్లు తక్కువ ధరకు దొరికినప్పుడు వాటిని కొనుగోలు చేయాలి. షేర్ల ధరలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. మనం ఎంచుకున్న మంచి ఇన్వెస్ట్‌మెంట్లపై నమ్మకంతో, ఓపికగా వేచి చూడాలి. ఇదే 'వాల్యూ ఇన్వెస్టింగ్' ప్రధాన సూత్రం. ఈ పద్ధతి ద్వారానే బఫెట్ దశాబ్దాల తరబడి స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన రాబడులను సాధించగలిగారు.

46
ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో సహనంతో వ్యవహరించండి

వారెన్ బఫెట్, ఆయన భాగస్వామి ఛార్లీ ముంగర్ ఎప్పుడూ ఒకే ఇన్వెస్ట్‌మెంట్ సూత్రాన్ని నమ్మారు. అదే "నెమ్మదిగా, కానీ సరైన మార్గంలో ముందుకు సాగడం". మార్కెట్‌లో ప్రతి చిన్న మార్పుకు తక్షణమే స్పందించడం బఫెట్ శైలి కాదు. ఓపికగా ఉండటమే ఆయన సుదీర్ఘమైన విజయావకాశాలకు మూలస్తంభం. ప్రొఫెసర్ టాడ్ ఫింకెల్ బఫెట్ గురించి మాట్లాడుతూ, "వారెన్ నుంచి నేర్చుకున్న విషయాలు నా వ్యక్తిగత జీవితంలోనూ, ఆర్థిక నిర్ణయాలలోనూ ప్రతిరోజూ నన్ను సానుకూలంగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి" అని పేర్కొన్నారు.

56
మీ నిర్ణయాలను ఎవరు ప్రభావితం చేస్తున్నారో గమనించండి

మనం ఎవరితో సమయం గడుపుతున్నాం అనేది మన జీవితాన్ని, మనం తీసుకునే నిర్ణయాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని బఫెట్ గట్టిగా నమ్ముతారు. "మీరు ఎలాంటి వ్యక్తులతో ఉంటే, అలాంటి ఆలోచనలే మీకు వస్తాయి. కాబట్టి మీ చుట్టూ ఉన్న పరివారం చాలా ముఖ్యం" అని ఆయన సలహా ఇస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో సరైన నిపుణులు, మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం వల్ల మార్కెట్‌లో తప్పుడు అడుగులు వేయకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

66
కోలుకోలేని నష్టాల బారిన పడకుండా చూసుకోండి

బఫెట్ ఇన్వెస్ట్‌మెంట్ రూల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి. ఆయన చెప్పే మొదటి నియమం: "ఎప్పుడూ మీ సొంత డబ్బును నష్టపోకండి." రెండవ నియమం: "ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి నియమాన్ని మరచిపోకండి." అంతేకాకుండా, "సముద్రంలో అలలు వెనక్కి తగ్గినప్పుడే, ఎవరు దుస్తులు లేకుండా ఈదుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది" అని బఫెట్ తరచూ చెబుతుంటారు. అంటే మార్కెట్‌లో కష్టకాలం లేదా మందగమనం వచ్చినప్పుడే, అనవసరమైన రిస్క్ తీసుకున్న ఇన్వెస్టర్లు ఎవరో బయటపడతారని దీని అర్థం. ప్రతి ఇన్వెస్టర్ కూడా ఎల్లప్పుడూ రిస్క్ మేనేజ్‌మెంట్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories