జొమాటో విడుదల చేసిన రెండు యాడ్స్ ఒకే విధమైన అర్ధాన్ని వివరిస్తాయి. ఒక యాడ్ లో జొమాటో డెలివరీ పార్ట్నర్ ఫుడ్ ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి డోర్‌బెల్ మోగించిన వెంటనే హృతిక్ రోషన్ బయటికి వస్తాడు దీంతో డెలివరీ పార్ట్నర్ ఆశ్చర్యపోతాడు. హ్రితిక్ రోషన్ అతడిని సెల్ఫీ కోసం వెయిట్ చేయమని చెప్తాడు, దీంతో డెలివరీ పార్ట్నర్ చాలా సంతోషంగా భావిస్తాడు. ఇంతలోనే అతనికి మరొక ఆర్డర్ డెలివరీ గురించి ఫోన్ రింగ్ అవుతుంది. దీంతో జోమాటో డెలివరీ పార్ట్నర్ హృతిక్ రోషన్‌తో సెల్ఫీ అవకాశాన్ని సంతోషంగా వదులుకుంటాడు. ఎందుకంటే " హృతిక్ రోషన్ హో యా ఆప్, అప్నే లియే హర్ కస్టమర్ హై స్టార్ (ఎందుకంటే అది మీరే అయినా హృతిక్ రోషన్ అయినా, ప్రతి కస్టమర్ జోమాటోకి స్టార్). " అని చూపిస్తుంది.
కత్రినా కైఫ్ యాడ్ కూడా ఇదే తరహాలో ఉంటుంది - కత్రినా కైఫ్ జొమాటో డెలివరీ పార్ట్నర్ ని బర్త్ డే కేక్ ఇవ్వడానికి వైట్ చేయమని చెప్తుంది, కానీ అతను ఆ అవకాశాన్ని వదులుకొంటాడు. ఎందుకంటే అతని ఫోన్ మరొక ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయమని నోటిఫికేషన్‌తో వస్తుంది.
గిగ్ వర్కర్ల పట్ల ప్రవర్తన నేటి యుగంలో టోన్-డెఫ్ అయినందుకు సోషల్ మీడియాలో ఈ యాడ్స్ పై వ్యతిరేకత మొదలైంది. ట్విట్టర్‌లో జొమాటో డెలివరీ పార్ట్నర్ లకు ఫుడ్ డెలివరీ ఆర్డర్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవడానికి నిమిషం సమయం లేదని యాడ్స్ ద్వారా సూచించడమే తప్ప మరొకటి చేయలేదని, మరికొందరు డెలివరీ పార్ట్నర్ లకు వేతనాలు చెల్లించడం కంటే సెలబ్రిటీల యాడ్స్ కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారని ట్వీట్ చేశారు.
అయితే ఈ విమర్శలకు జోమాటో ప్రతిస్పందిస్తూ ఈ యాడ్స్ ఆరు నెలల క్రితం కన్సెప్ట్ చేయబడింది అని అన్నారు.
ఈ యాడ్స్ ముఖ్య ఉద్దేశం డెలివరీ పార్ట్నర్ లను యాడ్స్ లో హీరోగా చూపెట్టడం, డెలివరీ పార్ట్నర్ లతో గౌరవంగా మాట్లాడటం, డెలివరీ పార్ట్నర్ ల ఉద్యోగానికి సంబంధించిన స్థాయిని పెంచడం, ప్రతి కస్టమర్ ఒక స్టార్ అని పునరుద్ఘాటించడం అని కంపెనీ తెలిపింది.
"మా యాడ్స్ మంచి ఉద్దేశ్యంతో ఉన్నాయని మేము నమ్ముతున్నాము, కానీ దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకున్నారు" అని జొమాటో తెలిపింది.
గత కొన్ని నెలలుగా జొమాటో ఇతర డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు డెలివరీ అసోసియేట్‌ల ప్రయోజనాలను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరిగాయి. వారు పని గంటలు, డెలివరీ టైమ్‌లైన్‌లు, వేతనాల గురించి ఫిర్యాదు చేశారు. "మీరు మా నుండి మరింత మెరుగైన ఆశిస్తారని మేము అర్థం చేసుకున్నాము" అని జోమాటో తెలిపింది.
"మా డెలివరీ పార్టనర్ నెట్ ప్రమోటర్ స్కోర్ -10% నుండి 28% కి పెరిగింది. మేము త్వరలో మా డెలివరీ పార్ట్నర్ ల పని/సమయానికి పరిహారం వివరిస్తూ ఒక బ్లాగ్ పోస్ట్‌ను ప్రపబ్లిష్ చేస్తాము" అని జోమాటో వెల్లడించింది.