తక్కువ పెట్టుబడి... ఎక్కువ లాభాలు
ఉడికించిన పప్పుల వ్యాపారంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ తక్కువ పెట్టుబడే.
ప్రారంభ పెట్టుబడి : ఒక చిన్న తోపుడు బండి లేదా టేబుల్, స్టీల్ గిన్నెలు, స్టవ్, ముడిసరుకులకు (శనగలు, బఠాణీ, మసాలాలు) కలిపి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు చాలు.
లాభం : పప్పుల ఉడికించడానికి (మసాలా, గ్యాస్ ఖర్చులతో కలిపి) సుమారు రూ.80 నుంచి రూ.100 ఖర్చవుతుంది. దాన్ని చిన్న ప్లేట్లలో అమ్మితే రూ.300 నుంచి రూ.400 వరకు వస్తుంది. అంటే ఇందులో 60% నుంచి 70% నికర లాభమే ఉంటుంది.