బంగారు నగలు అంటే ఇష్టం ఉండని భారతీయ మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బంగారు నగలు ఎక్కువగా కొనడం, ఉపయోగించడం చేసే దేశాల్లో భారతదేశం టాప్ 1 లో ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో బంగారు నగల కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఇండియన్స్ బంగారాన్ని సంపద, సాంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారు.
ఇండియా తరువాత చైనా కూడా బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాలలో ఒకటి. బంగారాన్ని సంపదకు, మానసిక ప్రశాంతతకు చిహ్నంగా భావించే చైనాలో కూడా పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో బంగారు నగలను ఎక్కువగా ఉపయోగిస్తారు. దుబాయ్ లాంటి యునైటెడ్ అరబ్ దేశాలు కూడా బంగారు నగల వ్యాపారానికి ప్రసిద్ధి చెందాయి.