వామ్మో.. Honda Activa ఎలక్ట్రిక్ స్కూటర్ 200 కి.మీ. మైలేజ్ ఇస్తుందా? ఫీచర్స్ అదిరిపోయాయిగా..

First Published | Nov 2, 2024, 4:51 PM IST

Honda Activa స్కూటర్ ఎలక్ట్రిక్ మోడల్ అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లో లాంచ్ అవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లలో Honda Activa టాప్ లో ఉంటుంది. కేవలం మైలేజీ కాకుండా మరిన్ని అదిరిపోయే ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. పండగల సందర్భంగా ధరలు భారీగా తగ్గిస్తూ అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చాయి. ఇప్పటికే ఓలా, టీవీఎస్, బజాబ్ వంటి దిగ్గజ కంపెనీలు దసరా సందర్భంగా అనేక ఆఫర్లు ఇచ్చి వాటి సేల్స్ పెంచుకున్నాయి. ఇప్పుడు హోండా కంపెనీ కూడా పోటీ కంపెనీలకు దీటుగా యాక్టివా మోడల్ ను ఎలక్ట్రిక్ వెర్షన్ లోకి తీసుకొస్తోంది.

హోండా యాక్టివా 2014 ఏప్రిల్ లో ఇండియాలో మొదటి సారి ప్రారంభమైంది. తర్వాత 125 cc (7.6 cu in) ఇంజిన్‌తో యాక్టివా అప్‌గ్రేడ్ మోడల్‌ను ప్రారంభించింది. దీన్ని Activa 125గా రీబ్రాండ్ చేసింది. ప్రస్తుతం Activa-i, Activa 125 రెండూ ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న వెహికల్స్ జాబితాలో టాప్ లో ఉన్నాయి. 

2013 డిసెంబర్ లో యాక్టివా చవకైన, తేలికైన వెర్షన్ అయిన Activa-iని హోండా ఇండియాలో విక్రయించడం ప్రారంభించింది. ఇది 110 cc కెపాసిటీ కలిగిన ఇంజన్‌తో పనిచేస్తుంది. 2015లో కేవలం ఐదు నెలల్లో 1 మిలియన్ యాక్టివాలను విక్రయించినట్లు హోండా ప్రకటించింది. 

2018లో హోండా 5జీ హోండా యాక్టివాను విడుదల చేసింది. తర్వాత యాక్టివా 6G భారతదేశంలో రూ.63,912 తక్కువ ధరకు విక్రయించడంతో అధికంగా సేల్ అయ్యాయి. 

మార్కెట్ లో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన కంపెనీలైన ఓలా, ఏథర్‌ వాహనాల విక్రయాల్లో పోటీ పడుతున్నాయి. 2023లో ఓలా కంపెనీ భారతదేశంలో 30% వాటాతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌ను నడిపించింది. ప్రస్తుతం ఇది Ola S1 అనే పేరుతో ఓలా S1 ఎయిర్, Ola S1X, S1 ప్రో అనే మూడు వేరియంట్లలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తోంది. కంపెనీ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మోడల్‌లను 2025లో విడుదల చేయాలని ప్రయాత్నాలలో ఉంది. 


భారతదేశపు మూడవ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు అయిన ఏథర్‌ కూడా అనేక మోడల్స్ తో మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 2013లో ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఓలా, టీవీఎస్ వంటి దిగ్గజ కంపెనీలకు పోటీని ఇస్తూనే ఉంది. 

ప్రస్తుతం హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ తో దిగ్గజ కంపెనీలైన ఓలా, టీవీఎస్, ఏథర్ కంపెనీలకు పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఏథర్, ఓలా, టీవీఎస్, హీరో వంటి పెద్ద కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. హోండా తన మొదటి బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి తీసుకురానుంది. 

కొన్ని కారణాల వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ ఒక సంవత్సరం ఆలస్యం అవుతోంది. ఈ స్కూటర్ మార్చి 2025లో విడుదల కానుంది. బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో వస్తుందని అంచనా.

అధునాతన ఫీచర్స్, మంచి డ్రైవింగ్ రేంజ్, కీలెస్ వంటి ఫీచర్స్ ఉంటాయి. డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ABS, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. వరకు వెళ్లొచ్చు. ఇది బ్యాటరీ-స్వాపింగ్ మోడల్ లో ఉంటుందని సమాచారం. హోండా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో టైఅప్ అయ్యింది. దేశంలోని పెట్రోల్ పంపుల వద్ద బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. కాబట్టి మార్చుకోదగిన బ్యాటరీ టెక్‌తో హోండా EV ద్విచక్ర వాహనాలు లాంచ్ అవనున్నాయి. దీని ధర సుమారు రూ.లక్ష నుంచి రూ.1.2 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

Latest Videos

click me!