LIC: ఏడాదికి ల‌క్ష రూపాయ‌ల గ్యారంటీ పెన్ష‌న్‌.. ఎల్ఐసీ నుంచి అద్భుత‌మైన స్కీమ్

Published : Dec 31, 2025, 05:16 PM IST

LIC: ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ ఉండాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. అందుకోసం ప‌లు ర‌కాల ప‌థ‌కాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఎల్ఐసీ అందిస్తోన్న జీవ‌న్ శాంతి ప్లాన్ ఒక‌టి. ఇంత‌కీ ఏంటీ స్కీమ్‌.? దీంతో ఉండే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
LIC న్యూ జీవన్ శాంతి ప్లాన్ అంటే ఏమిటి?

న్యూ జీవన్ శాంతి అనేది LIC అందిస్తున్న డిఫర్డ్ ఎన్యుటీ పెన్షన్ ప్లాన్. ఈ స్కీమ్‌లో మీరు ఒకేసారి (లంప్‌సమ్) డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. నిర్ణీత కాలం తర్వాత మీకు నెలనెలా లేదా ఏడాదికోసారి పెన్షన్ రావడం మొదలవుతుంది. ఈ ప్లాన్ షేర్ మార్కెట్‌తో సంబంధం లేకుండా పనిచేస్తుంది. అందుకే ఇందులో పెట్టుబడి రిస్క్ చాలా తక్కువ.

25
ఈ స్కీమ్‌లో ఉన్న ఆప్షన్లు, లాక్-ఇన్ పీరియడ్

ఈ ప్లాన్‌లో 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత ఐదేళ్ల వరకూ ఆ డబ్బును తీసుకోలేరు.

ఈ స్కీమ్‌లో రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి:

సింగిల్ లైఫ్ డిఫర్డ్ ఎన్యుటీ

జాయింట్ లైఫ్ డిఫర్డ్ ఎన్యుటీ

ఒకరి పేరుపై లేదా దంపతుల పేరుపై ఈ ప్లాన్ తీసుకోవచ్చు.

35
పెన్షన్ ఎలా వస్తుంది?

ఈ స్కీమ్ తీసుకున్న తర్వాత పాలసీదారుడికి జీవితాంతం పెన్షన్ వస్తుంది. సింగిల్ లైఫ్ ప్లాన్‌లో పాలసీదారుడు మరణిస్తే, పెట్టుబడి చేసిన మొత్తం నామినీకి చెల్లిస్తారు. జాయింట్ లైఫ్ ప్లాన్‌లో ఒకరు మరణిస్తే, మిగతా వ్యక్తికి పెన్షన్ కొనసాగుతుంది. ఇద్దరూ మరణిస్తే, మొత్తం నామినీకి వెళ్తుంది. పెన్షన్‌ను నెలవారీ, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి తీసుకునే అవకాశం ఉంది.

45
ఈ పాలసీ ముఖ్య ప్రయోజనాలు

అర్హత వయస్సు: 30 నుంచి 79 సంవత్సరాలు

కనీస పెట్టుబడి: రూ.1.5 లక్షలు

జీవితాంతం గ్యారంటీ పెన్షన్

కావాలంటే మధ్యలో పాలసీ స‌రెండ‌ర్ చేసే అవకాశం

మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉండదు.

రిస్క్ కవర్ లేకపోయినా, స్థిర ఆదాయం కోరుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

55
ఏడాదికి లక్ష రూపాయల పెన్షన్ ఎలా వస్తుంది?

ఉదాహరణకు 55 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.11 లక్షలు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత పెన్షన్ ప్రారంభమవుతుంది అప్పుడు అతడికి ఏడాదికి సుమారు రూ.1,01,880 పెన్షన్ వ‌స్తుంది. అంటే నెల‌కు నెలకు దాదాపు రూ.8,149. ఆరు నెలలకు ఒకసారి రూ.49,911 పెన్షన్ లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories