Money: అప్పు తీసుకుని ఎగ్గొట్టారా.? ఈ కేసు వేస్తే దెబ్బకు తిరిగి ఇచ్చేస్తారు..

Published : Mar 24, 2026, 08:38 AM IST

Money: మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి పొందలేకపోతున్నారా? అప్పు వసూలు చేయడానికి చట్టంలో ఉన్న మార్గాలేమిటి? ప్రామిసరీ నోట్, చెక్ బౌన్స్ కేసుల ద్వారా మీ డబ్బును ఎలా తిరిగి పొందాలో ఇప్పుడు తెలుసుకోండి. 

PREV
15
అప్పుగా ఇచ్చిన డబ్బును చట్టపరంగా తిరిగి పొందడం ఎలా?

నిత్య జీవితంలో ఒకరికొకరు అప్పులు ఇచ్చుకోవడం సాధారణం. కానీ, తీసుకున్న వారు తిరిగి ఇవ్వనప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి సమయంలో అప్పు ఇచ్చిన వారు చట్టపరంగా తమ డబ్బును ఎలా తిరిగి పొందవచ్చో న్యాయ నిపుణులు కీలక సలహాలు ఇచ్చారు.

25
ప్రామిసరీ నోట్ - కాలపరిమితి:

ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోట్ రాయించుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఈ ప్రామిసరీ నోట్ కు మూడు సంవత్సరాల కాలపరిమితి మాత్రమే ఉంటుందని గుర్తు చేశారు. అప్పు తీసుకున్న తేదీ నుంచి మూడేళ్ల లోపు డబ్బు తిరిగి రాకపోతే, ఆ నోట్ చెల్లుబాటు కాదు. అలాంటి సమయంలో పాత నోట్ స్థానంలో కొత్త ప్రామిసరీ నోట్ రాయించుకోవడం లేదా కోర్టులో రికవరీ సూట్ ఫైల్ చేయడం ఉత్తమం.

35
చెక్ బౌన్స్ కేసులు(NI Act Section 138):

అప్పు తీసుకున్న వారు చెక్ ఇచ్చినప్పుడు, అది బ్యాంకులో అమౌంట్ లేక 'ఇన్‌సఫిషియెంట్ ఫండ్స్' అని రిటర్న్ అయితే, అది క్రిమినల్ నేరం కిందకు వస్తుంది. చెక్ బౌన్స్ అయిన 30 రోజుల్లోపు నిందితుడికి లీగల్ నోటీసు పంపాలి. నోటీసు అందిన 15 రోజుల్లోపు వారు స్పందించకపోతే, న్యాయస్థానంలో కేసు నమోదు చేయవచ్చు. ఈ కేసుల్లో నిందితుడికి జైలు శిక్షతో పాటు, అప్పు మొత్తానికి రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

45
ఆధారాలు లేని లావాదేవీలు:

కేవలం నమ్మకంతో లేదా ఓరల్ అగ్రిమెంట్ ద్వారా అప్పు ఇచ్చినప్పుడు దానిని నిరూపించడం కష్టం. అలాంటి సమయంలో బ్యాంకు ట్రాన్సాక్షన్స్ లేదా సాక్షుల ద్వారా కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది. అందుకే పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చేటప్పుడు కచ్చితంగా ప్రామిసరీ నోట్ లేదా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉండాలని సూచించారు.

55
అది పాటిస్తే కష్టార్జితాన్ని సురక్షితం..

డబ్బు లావాదేవీల విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. సరైన ఆధారాలు, చట్టపరమైన అవగాహన ఉంటేనే మీ కష్టార్జితాన్ని సురక్షితంగా తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories