రోడ్డుపై ఉండే లైన్స్ వెనుక ఇన్ని రూల్స్ ఉన్నాయా? క్రాస్ చేస్తే అంత ప్రమాదమా?

First Published | Oct 26, 2024, 2:30 PM IST

రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు రకరకాల వైట్, ఎల్లో లైన్స్ కనిపిస్తాయి కదా? వాటర్థం ఏంటో మీకు తెలుసా? ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మాత్రమే ఈ లైన్స్ వేస్తారు అని చాలా మంది అనుకుంటారు. అయితే వాటి వెనుక చాలా రూల్స్ ఉన్నాయి. అసలు రోడ్డుపై ఈ తెలుపు, పసుపు రంగు లైన్లు ఎందుకు వేస్తారు. వాటి వెనుక ఉన్న పూర్తి స్టోరీ ఇక్కడ తెలుసుకోండి. 
 

ప్రతి రోడ్డుపై మనకు బ్రోకెన్ వైట్ లైన్స్ కనిపిస్తాయి. రోడ్డు అంచులో పూర్తి వైట్ లైన్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు కొన్ని చోట్ల ఎల్లో లైన్స్ కూడా మీరు చూసే ఉంటారు. ఈ పసుపు రంగు లైన్స్ లోనూ డబుల్ ఎల్లో లైన్స్ ఉంటాయి. మలుపుల్లోనూ ఎల్లో, వైట్ లైన్స్ ఉంటాయి. కొండలు, లోయల్లోనూ ఈ లైన్స్ మీరు చూసే ఉంటారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఇలా రకరకాల లైన్లు వేస్తారు. ఒక సిస్టమాటిక్ గా వెహికల్స్ వెళితే యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. అందుకే లైన్స్ వేసి వాహనాలు వెళ్లేలా రూల్స్ పెట్టారు. మరి ఏ లైన్ ఎక్కడ, ఎందుకు వేస్తారో డిటైల్డ్ గా ఇక్కడ తెలుసుకోండి. 
 

బ్రోకెన్ వైట్ లైన్స్

ఈ బ్రోకెన్ వైట్ లైన్స్ ను మనం అన్నిచోట్లా చూస్తుంటాం. ముఖ్యంగా నేషనల్ హైవేస్, స్టేట్ రోడ్లపై కనిపిస్తుంటాయి. ఇలాంటి వైట్ లైన్స్ అర్థం ఏమిటంటే.. మీ ప్రయాణంలో అవసరమైతే మీరు ఈ వెహికల్ ద్వారా ఈ లైన్స్ ను క్రాస్ చేసి ప్రయాణించొచ్చు. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే మీరు ఈ బ్రోకెన్ వైట్ లైన్ క్రాస్ చేసి ఓవర్ టేక్ చేయొచ్చు. ప్రమాదాలు జరగని చోట బ్రోకెన్ వైట్ లైన్ వేస్తారు. 
 


వైట్ లైన్

ఈ వైట్ లైన్ కంటిన్యూగా ఉంటుంది. ఎక్కడా బ్రేక్ ఉండదు. దీని అర్థం ఏమిటంటే ఈ వైట్ లైన్ ఉన్నచోట ఆ లైన్ ను క్రాస్ చేయకూడదు. అలా చేస్తే వెహికల్స్ ఢీకొట్టుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోటుల్లోనే ఈ కంటిన్యూ వైట్ లైన్ వేస్తారు. ముఖ్యంగా ప్రమాదకర మలుపులు, కొండలు, లోయల్లో ఈ వైట్ లైన్స్ వేస్తారు. అత్యవసరమై ఉండి మీరు ఈ వైట్ లైన్ క్రాస్ చేస్తే ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రిస్క్ ఉంటుందని తెలియజేసేందుకే ఈ కంటిన్యూ వైట్ లైన్ వేస్తారు. 
 

ఎల్లో లైన్

పసుపు రంగు లైన్ కనిపించిందంటే దానర్థం మీ వెహికల్ పొరపాటున కూడా ఈ ఎల్లో లైన్ క్రాస్ చేయకూడదని అర్థం. ఎందుకంటే ఎల్లో లైన్ అటువైపు కూడా వాహనాలు వేగంగా దూసుకు వస్తుంటాయి. మీ ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి మీరు కనుక ఎల్లో లైన్ దాటారంటే కచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతుంది. కావాలంటే మీకున్న స్పేస్ లోనే మీ ముందున్న వెహికల్ ను ఓవర్ టేక్ చేయొచ్చు. అంతే తప్ప ఎల్లో లైన్ దాటి ఓవర్ టేక్ చేయకూడదు. 
 

డబుల్ ఎల్లో లైన్

మీకు ఎక్కడైనా డబుల్ ఎల్లో లైన్ కనిపిస్తే మీరు మరింత జాగ్రత్తగా వెహికల్ నడపాలి. ఎందుకంటే ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతంలో డబుల్ ఎల్లో లైన్స్ వాడతారు. ఇక్కడ వెహికల్స్ ఓవర్ టేకింగ్ జరగకుండా వీటిని ఉపయోగిస్తారు. అంటే మీకున్న రోడ్డు స్పేస్ లో కూడా మీరు మీ ముందున్న వెహికల్ ని ఓవర్ టేక్ చేయకూడదు. ఈ రూల్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని డబుల్ ఎల్లో లైన్ వేస్తారు. 
 

జీబ్రా క్రాస్ లైన్

ప్రజలు రోడ్ క్రాస్ చేయడానికి వీలుగా హైవేలు, ఇతర రోడ్లపై జీబ్రా క్రాస్ లైన్స్ వేస్తారు. ఇవి ఉన్న చోట మాత్రమే ప్రజల రోడ్డు దాటాలి. ఇవి లేని చోట రోడ్డు దాటితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.  వాహనాలు నడిపే వారు కూడా ఇవి ఉన్న చోట వెహికల్స్ స్లోగా నడపాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు రోడ్ క్రాస్ చేస్తారో తెలియదు కాబట్టి సడన్ గా ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల జీబ్రా లైన్స్ ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్లు జాగ్రత్తగా నడపాలి. 

Latest Videos

click me!