దీపావళికి జియో ధమాకా ఆఫర్: ఒక్క రీఛార్జ్‌తో రూ.3,350 విలువైన గిఫ్ట్ కూపన్స్ ఫ్రీ

First Published | Oct 26, 2024, 12:12 PM IST

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం దీపావళి ధమాకా ఆఫర్ తీసుకొచ్చింది. ఈ 5G ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే భారీ గిఫ్ట్ ఆఫర్లు పొందొచ్చు. ఇప్పటికే అనేక ఆఫర్లతో తన కస్టమర్లకు విలువైన సేవలు అందిస్తున్న జియో దీపావళికి మరోసారి బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఈ ఆఫర్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా పేరున్న టెలికాం సర్వీస్. దేశం మొత్తం మీద ఎక్కువ మంది వినియోగించే నెట్వర్క్ జియో. దీని తర్వాత స్థానాల్లో ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్-ఐడియా ఇతర నెట్వర్క్ లు ఉన్నాయి. టారిఫ్ ధరలు పెంచినప్పటికీ జియో, ఎయిర్ టెల్ కి పోటీగా బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో దూసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ తాకిడి తట్టుకొనేందుకు ఇతర నెట్వర్క్ లు రీఛార్జ్ ప్లాన్ ధరలు తగ్గిస్తూ తమ వినియోగదారులకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇవే కాకుండా సందర్భం వచ్చిన ప్రతిసారి డిస్కౌంట్ ఆఫర్లతో తమ వినియోగదారులు ఇతర నెట్వర్క్ ల వైపు వెళ్లకుండా చూసుకుంటున్నాయి. ఇప్పటికే గణపతి, శరన్నవరాత్రుల సందర్భంగా అనేక ఆఫర్లు ప్రకటించిన టెలికాం కంపెనీలు ఈ దీపావళికి కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంలో జియో ముందుంది. 

Jio True 5G పేరుతో త్రైమాసిక, వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లను తీసుకొచ్చింది. ఇవి రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు ఫుడ్, ట్రావెలింగ్, షాపింగ్‌ కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు పొందొచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగించే వారికి కూడా ఉచిత వోచర్‌లను ఇస్తోంది. ఈ ప్రయోజనాల మొత్తం విలువ రూ.3,350.


ప్రీపెయిడ్ ప్లాన్‌లు ప్రయోజనాల వివరాలు

దీపావళి ధమాకా ఆఫర్ కింద త్రైమాసిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.899 లేదా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ రూ.3,599  మీరు రీఛార్జ్ చేసుకుంటే ఈ గిఫ్ట్ కూపన్లు పొందవచ్చు. రూ.899 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు 2GB డేటా ఇస్తారు. రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ వ్యాలిడిటీ 90 రోజులు. ఇదే కాకుండా అదనంగా 20 GB డేటా కూడా మీరు పొందవచ్చు. 

రూ.3,599  ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల పాటు రోజుకు 2.5 GB డేటా మీరు పొందొచ్చు. రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. 

దీపావళి ధమాకా ఆఫర్‌లో భాగంగా రూ.899 లేదా రూ.3,599తో రీఛార్జ్ చేసుకుంటే రూ.3,350 విలువైన వోచర్‌లు మీరు పొందొచ్చు. వీటిలో హోటల్‌లు, విమాన ప్రయాణాల కోసం Ease My Trip నుండి రూ.3,000 వోచర్, రూ.999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లపై వర్తించే AJIO నుండి రూ.200 కూపన్ పొందొచ్చు. అంతేకాకుండా రూ.150 విలువైన Swiggy వోచర్ కూడా పొందొచ్చు. 

మీరు రీఛార్జ్ చేసిన తర్వాత ఈ వోచర్‌లు మీ జియో యాప్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతాయి. వీటిని మీరు పొందడానికి ముందుగా మీరు MyJio యాప్‌ని తెరవండి

అందులో offers విభాగానికి వెళ్లండి.
తర్వాత My winnings ఓపెన్ చేయండి.
మీరు ఉపయోగించాలనుకుంటున్న కూపన్‌ను ఎంచుకోండి.
తర్వాత కూపన్ కోడ్‌ను కాపీ చేయండి. 
తర్వాత వారు భాగస్వామి వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్అవుట్ వద్ద దరఖాస్తు చేయండి.
దీపావళి ధమాకా ఆఫర్ ఇప్పటికే లైవ్‌లో ఉంది. ఇది నవంబర్ 5 వరకు అమలులో ఉంటుంది.

Latest Videos

click me!