సిబిల్ స్కోర్ 550 నుండి 600 పాయింట్లు ఉన్నప్పటికీ లోన్ ఎలా పొందాలో తెలుసుకోండి..?

First Published | Aug 11, 2023, 3:07 PM IST

సాధారణంగా బ్యాంకులు మంచి సిబిల్ స్కోర్ లేకుండా రుణాలు ఇవ్వవు. కానీ కొన్నిసార్లు మనకు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్ పడిపోతుంది ఈ నేపథ్యంలో, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకు నుంచి రుణం పొందే మార్గాలు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో బ్యాంకుల నుంచి లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ హిస్టరీని తెలియజేస్తుంది.  సిబిల్ స్కోర్ ఆధారంగానే మీకు రుణం మంజూరు చేయాలా వద్దా అని బ్యాంకులు . నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి.  అయితే మీ సిబిల్ స్కోరు 750 కన్నా ఎక్కువగా ఉంటే మీకు లోన్ లభించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అంతకన్నా తక్కువగా ఉంటే మాత్రం మీకు వడ్డీ రేటు పెరుగుతూ ఉంటుంది.  ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 600 పాయింట్ల కన్నా తక్కువగా ఉన్నట్లయితే మీకు లోన్ లభించే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఒకవేళ మీ సిబిల్ స్కోర్ ఐదు ఆరు వందల పాయింట్ల కన్నా తక్కువ ఉన్నట్లు అయితే మీరు లోన్ పొందేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు గతంలో తీసుకున్నటువంటి అప్పులు లేదా క్రెడిట్ కార్డు చెల్లింపులు, విషయంలో ఏదైనా  ఆలస్యం జరిగి ఉంటే మాత్రం ఇది జరిగే అవకాశం ఉంది. ఒక్కోసారి క్రెడిట్ కార్డ్ చెల్లింపులు మీరు లేటుగా చేసినట్లయితే, మీ  సిబిల్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.  అందుకే క్రెడిట్ కార్డు చెల్లింపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 


సిబిల్ స్కోర్ ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులతోపాటు  నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం మీకు రుణాలను మంజూరు చేస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో మీకు సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా రుణం పొందాలని ఆలోచిస్తే మాత్రం కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

సాధారణంగా బ్యాంకులు ఎల్ఐసి పాలసీలను కూడా తనకా పెట్టుకుని రుణాలను మనకు అందిస్తూ ఉంటాయి. . అలాంటి సమయంలో మీరు మీ ఎల్ఐసి పాలసీని బ్యాంకులో పెట్టి రుణం పొందే అవకాశం ఉంది ఇందుకోసం మీరు బ్యాంకు వద్దకు వెళ్లి సమాచారం పొందాల్సి ఉంటుంది.  పాలసీ విలువకు తగినట్లు మీకు రుణం అందుబాటులో ఉంటుంది. 

మరో పద్ధతిలో కూడా సిబిల్ స్కోర్ లేకుండానే మీరు రుణం పోతే అవకాశం ఉంది అదేమిటంటే.  మీరు లోన్ పొందే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లయితే అందుకు తగినట్లుగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణం పొందే అవకాశం ఉంది తద్వారా మీరు  ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండానే రుణం పొందే అవకాశం లభిస్తుంది.  మీరు నివసించే గృహం మీ సొంతం అయినట్లయితే ఆస్తి పత్రాలను సైతం బ్యాంకులో తనకా పెట్టి రుణం పొందవచ్చు అలాంటి సందర్భంలో సైతం ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండానే బ్యాంకులు మీకు రుణం అందిస్తాయి. 
 

పైన పేర్కొన్న పద్ధతుల్లో మీరు సెక్యూర్డ్ రుణాలను పొందే అవకాశం ఉంది అయితే ఇందులో ఒక ప్రమాదం ఉంది మీరు తనఖా పెట్టిన  ఆస్తిని,  మీరు సకాలంలో రుణ వాయిదాలు చెల్లించకపోతే మాత్రం బ్యాంకు ను సొంతం చేసుకొని వేలంపాటలో విక్రయించే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా రుణం తీసుకుంటే మంచిది. 
 

Latest Videos

click me!