ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది దీంతో మహిళలు బంగారం ఎప్పుడు కొనుగోలు చేయాలని ఎదురుచూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం తగ్గుతున్నటువంటి బంగారం ధరలు మహిళలకు పండగ వాతావరణం తెస్తున్నాయి. శ్రావణమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు మొదటి నుంచి అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అంతర్జాతీయ కారణాల ఫలితంగా పసిడి ధరలు కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి.
అంతర్జాతీయ అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధరలు ప్రస్తుతం చాలా తక్కువ రేంజ్ లో ఉన్నాయి. ప్రధానంగా పసిడి ధర ఒక ఔన్స్ అంటే 31 గ్రాముల ధర 1940 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రేంజ్ వద్ద బంగారం ధర గత కొద్ది కాలంగా ట్రేడ్ అవుతోంది అయితే ప్రధానంగా అమెరికా డాలర్ ధర పుంజుకుంటుంది. ఇది బంగారం ధర తగ్గడానికి కారణం అవుతోంది. దీంతో పాటు అమెరికా ప్రభుత్వం విడుదల చేసే ట్రెజరీ బాండ్ విలువ గడచిన వారం రోజులుగా పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం పై బదులుగా అమెరికా ట్రెజరీ బాండ్ల పై పెడుతున్నారు ఫలితంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో దేశీయంగా శ్రావణమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మీరు కనుక బంగారం కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే మాత్రం వెంటనే దేశీయంగా బంగారం ధరలు గురించి కనుక్కోవచ్చు. ప్రస్తుతం హైదరాబాదు నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 59,950 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,950 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇదిలా ఉంటే శ్రావణమాసంలో ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో పసిడి ధరలు తగ్గి రావడం అనేది ఒకరకంగా అదృష్టం అనే చెప్పాలి. భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే కనక కొనసాగితే బంగారం ధర 55వేల కన్నా తక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టు పసిడి నిపుణులు చెబుతున్నారు.
శ్రావణమాసంలో మీరు గనుక బంగారం కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే. మీ కుటుంబంలో సెంటిమెంటుగా బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తున్నట్లయితే. బంగారు నాణేలు రూపంలో కొనుగోలు చేయడం చాలా అత్యుత్తమమైన పని. 24 క్యారెట్ల బంగారం నాణేలు బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీసుల్లోనూ అదే విధంగా బంగారు నగల దుకాణాల్లోనూ అమ్ముతున్నారు. ఇవి టెంపర్ ప్రూఫ్ సీల్ తో వస్తాయి. బంగారాన్ని మీరు నగలు చేయించుకోవడానికి వినియోగించుకోవచ్చు.
అలాగే శ్రావణ మాసంలో మీరు బంగారం షాపింగ్ వెళుతున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. భారత ప్రభుత్వం ఆమోదించిన హాలో గ్రామ్ లేకుండా బంగారు నగలు కొనుగోలు చేయవద్దు. బంగారం నగలు కొనుగోలు చేసిన తర్వాత రసీదు పొందడం తప్పనిసరి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు నష్టపోకుండా ఉంటారు.