Investment scheme: ఇలా చేస్తే మీ డ‌బ్బే డ‌బ్బును సంపాదిస్తుంది.. రూ. 5 ల‌క్ష‌లు పెడితే రూ. 10 ల‌క్ష‌లు

Published : Jul 09, 2025, 12:58 PM ISTUpdated : Jul 09, 2025, 12:59 PM IST

క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును పొదుపు చేయ‌డానికి చాలా మంది ఆస‌క్తి చూపిస్తారు. ఇందుకోసం ఎన్నో ర‌కాల ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ అందిస్తోన్న‌ అలాంటి ఒక బెస్ట్ సేవింగ్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
డబ్బుతో డబ్బు సంపాదించే సులభమైన మార్గం

మ‌న‌లో ప్ర‌తీ ఒక్క‌రూ ఆర్థిక భ‌ద్ర‌త‌ను కోరుకుంటారు. ముఖ్యంగా పొదుపు చేయాల‌నుకునే ప్ర‌జ‌లు ఎక్కువ ప్ర‌యోజ‌నం ల‌భించే ప‌థ‌కాల‌వైపు మొగ్గు చూపుతారు. అలాంటి స్కీముల్లో పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న "కిసాన్ వికాస్ పత్ర" (KVP) స్కీమ్ ఒకటి. 

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా క‌చ్చితంగా రాబడి లభిస్తుంది. ఎటువంటి మార్కెట్ అనిశ్చితులు లేకుండా, ప్రభుత్వ హామీతో మన డబ్బు రెట్టింపు అవుతుంది.

25
కేవీపీ స్కీమ్ ప్రత్యేకతలు

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఇండియా పోస్టాఫీస్ ద్వారా అందిస్తోంది. ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. చిన్నపిల్లల పేరుపై కూడా ఈ సర్టిఫికెట్‌ను తీసుకోవచ్చు. అవసరమైతే, ఈ పత్రాలను ఒక వ్యక్తి నుంచి మరొకరికి బదిలీ చేయవచ్చు. అలాగే ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు కూడా సర్టిఫికెట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

35
115 నెలల్లో పెట్టిన డబ్బు రెట్టింపు

కిసాన్ వికాస్ పత్రలో పెట్టిన డబ్బు ప్రస్తుతం 115 నెలలలో డబుల్ అవుతుంది. అంటే 9 సంవత్సరాలు 7 నెలల తర్వాత మీరు పెట్టిన మొత్తం రెండింతలు అవుతుంది. ఈ స్కీమ్‌పై ప్రస్తుతం ప్రభుత్వ నిర్దేశిత వడ్డీ రేటు 7.5%గా ఉంది. దీని అర్థం పెట్టుబడి చక్కగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఈ ప‌థ‌కంలో రూ. 5 ల‌క్ష‌లు ఇన్వెస్ట్ చేస్తే నిర్ణీత కాలానికి రూ. 10 ల‌క్ష‌లు పొందొచ్చు.

45
ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్, విత్‌డ్రా

ఈ స్కీమ్‌లో కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి ఏమి ఉండదు. మీరు మీ అవసరాల మేరకు ఎన్ని సర్టిఫికెట్లు అయినా కొనుగోలు చేయవచ్చు. ఒక్క‌సారిగా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడితే క‌నీసం 2 సంవత్సరాలు 6 నెలలు పూర్తయిన తర్వాతే విత్‌డ్రా చేసుకోవచ్చు. పూర్తి రాబ‌డి రావాలంటే పూర్తి మెచ్యూరిటీ వరకు ఆగాల్సిందే.

55
మరణం సమయంలో భద్రత, లోన్ సౌకర్యం

ఒక‌వేళ పెట్టుబ‌డి పెట్టిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే నామినీకి లేదా చట్టపరమైన వారసులకు మొత్తం చెల్లిస్తారు. ఇది కుటుంబ ఆర్థిక భద్రతకు ఉపయోగపడుతుంది. మరోవైపు, ఈ సర్టిఫికెట్లపై లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే, మీరు డబ్బు పెట్టిన సర్టిఫికెట్‌ను కోలాటరల్‌గా చూపించి బ్యాంక్ లోన్ పొందొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories