ఈ 4 కరెక్టుగా చేస్తే మిమ్మల్ని కోటీశ్వరులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు!

Published : Jul 08, 2025, 05:10 PM IST

మనలో చాలామంది మధ్యతరగతి జీవితం గడుపుతున్నవారే. నిజానికి మధ్యతరగతి జీవితం అంత ఈజీ కాదు. అన్నింటికి సర్దుకుపోవాల్సి ఉంటుంది. అయితే జీవితంలో త్వరగా ఎదగాలన్నా, కోట్లల్లో డబ్బు సంపాదించాలన్నా కొన్ని విషయాలపై శ్రద్ధ అవసరం. అవేంటో చూద్దాం.  

PREV
15
జీవితంలో త్వరగా ఎదగాలంటే..

మన దేశంలో చాలామంది మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్నారు. తక్కువ జీతం, ఎక్కువ ఖర్చులు, ఊహించని పరిస్థితులు.. జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయి. అయితే కచ్చితమైన నిర్ణయం, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, నిరంతర ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా ఎదగవచ్చు. దానికి సంబంధించిన మూడు కీలక అంశాలను ఇక్కడ చూద్దాం.

25
స్పష్టమైన లక్ష్యాలు

డబ్బు సంపాదిస్తే చాలనుకుంటే ఎదుగుదల ఉండదు. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఎప్పుడు ఇల్లు కొనాలి? పిల్లల చదువు కోసం డబ్బు ఎప్పటినుంచి దాచిపెట్టాలి? ఎప్పుడు పదవీ విరమణ ప్రణాళిక ప్రారంభించాలి? వంటి వాటిని భవనం పునాదుల్లాగా ప్రణాళికాబద్ధంగా చేయాలి. 

35
నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి

మీరు ఏ రంగంలో ఉన్నా.. మీ నైపుణ్యాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవాలి. కంపెనీల్లో నష్టాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ.. మీకు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటే..  ఏ సంస్థ మిమ్మల్ని కోల్పోవాలి అనుకోదు. 

45
పెట్టుబడులు పెట్టడం

చిన్న వయసులోనే కొంత ఆర్థిక రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. షేర్ మార్కెట్ ఆధారిత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, మంచి రాబడి ఇచ్చే షేర్లలో పెట్టుబడి పెట్టాలి. వయసు పెరిగేకొద్దీ, తక్కువ రిస్క్ ఉన్న బాండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు వెళ్లాలి.  

55
అప్డేట్ అవసరం

కొత్త టెక్నాలజీలు, నిర్వహణ నైపుణ్యాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు మీ పురోగతికి అవసరం. అదే సమయంలో.. అదనపు ఆదాయం కోసం పార్ట్ టైమ్ ఉద్యోగాలను కూడా చూడండి. ఆన్‌లైన్ ఉద్యోగాలు, కన్సల్టెన్సీ సేవలు, స్వయం ఉపాధి వంటివి చేర్చుకుంటే ఆర్థిక స్థితిని సులభంగా మెరుగుపరుచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories