Job Report 2025: గత ఏడేళ్లలో భారతదేశంలో జీతాల్లో భారీ పెరుగుదల, ఎంత పెరిగిందంటే..

Published : Oct 06, 2025, 02:57 PM IST

భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాబ్ రిపోర్ట్ 2025 (Job report 2025) విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. అలాగే వారి లాభాలు కూడా పెరుగుతున్నాయి. నెలవారీ జీతాలు ఏడేళ్లలో చాలా పెరిగినట్టు అని నివేదిక చెబుతోంది. 

PREV
15
జీతాల్లో పెరుగుదల

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నివేదిక 2025ను బట్టి గత ఏడేళ్లలో భారతదేశంలో 17 కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించారు. ఎంతో మందికి ఉపాధి దొరికింది. జీతాల్లో కూడా ఎంతో పెరుగుదల కనిపించింది. ఉద్యోగాల్లో స్థిరత్వం కూడా కనిపించింది. ఇది ఎంతో సానుకూల అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. నెలవారీ జీతాల్లో కూడా గత ఏడేళ్లలో ఎంతో పెరుగుదల కనిపించినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

25
ఉద్యోగ లేమి తగ్గింది

మనదేశంలో ఉద్యోగ లేమి చాలావరకు తగ్గిందని ఈ ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2025 వివరిస్తోంది. 2017-18 సంవత్సరంలో మన దేశంలో ఉద్యోగాలు లేమి రేటు ఆరు శాతం మాత్రమే ఉంటే.. 2023- 24 కల్లా అది 3.2 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి ఎంతో మంది ఉద్యోగాలు పొందుతున్నారు అన్నది ఈ నివేదిక సారాంశం. దేశంలో ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నట్టు ఈ నివేదిక వివరిస్తుంది.

35
ఈపీఎఫ్ఓ కొత్త సభ్యులు

ఈపీఎఫ్ఓ చెబుతున్న ప్రకారం 2024-25లో కొత్తగా 1.29 మంది కొత్త సబ్‌స్క్రైబర్లు ఈపీఎఫ్‌వోలో చేరారు. 2025 జూలైలో ఆ ఒక్క నెలలోనే 21 లక్షల మంది కొత్తగా ఈపీఎఫ్ ఖాతాదారులుగా మారారు. దీన్నిబట్టి అంతమందికి కొత్త ఉద్యోగాలు వచ్చినట్టు తెలుస్తోంది. జూలై 2025లో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో 60 శాతం మంది 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య గల యువతే కావడం విశేషం.

45
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్

ఈ తాజా నివేదిక ప్రకారం చాలా మంది ఒకరి దగ్గర ఉద్యోగం చేసే కన్నా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ను ఇష్టపడుతున్నారు. 2017-18లో 52 శాతం మంది సెల్ఫ్ ఎంప్లాయిమెంట్లోనే కొనసాగుతున్నారు. అంటే సొంతంగా వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్నారు. దీని వల్ల లేబర్ ఉద్యోగాల సంఖ్య చాలా వరకు తగ్గింది.సొంతంగా పనులు, వ్యాపారాలు చేసుకుని తగిన మొత్తాన్ని సంపాదిస్తున్నారు.

55
ఎంత జీతం పెరిగింది?

ఇక ఉద్యోగస్తుల నెలవారీ జీతం కూడా గత ఏడేళ్లతో పోలిస్తే ఎంతో పెరిగింది. సాధారణ నెలవారీ జీతం ఏడేళ్లలో 16,538 రూపాయలుగా ఉండేది 21,103 రూపాయలు కు పెరిగినట్టు తెలుస్తోంది. అలాగే లేబర్ కూలీల రోజువారీ వేతనం 294 రూపాయలు నుంచి 433 రూపాయలకు పెరిగింది.

Read more Photos on
click me!

Recommended Stories